సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) కథానాయకుడిగా వస్తున్న సినిమా జైలర్‌(Jailer)...ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతున్నది. ఇందులో టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా జైలర్‌ ఆడియో లాంచింగ్‌ ఈవెంట్‌ను చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించబోతున్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) కథానాయకుడిగా వస్తున్న సినిమా జైలర్‌(Jailer)...ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతున్నది. ఇందులో టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా జైలర్‌ ఆడియో లాంచింగ్‌ ఈవెంట్‌ను చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా వస్తున్న భోళాశంకర్‌లోని నువ్‌ కావాలయ్యా పాటకు రిహార్సల్స్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. ఆడియో లాంచింగ్‌ ఈవెంట్‌కు రజనీకాంత్‌తో పాటుగా డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, నిర్మాతలు, నటీనటులు, అభిమానులు పెద్ద సంఖ్యలో రానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడ కోస అభిమానులకు వెయ్యి ఉచిత పాసులను జారీ చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. ఇలా ప్రకటించారో లేదో జస్ట్‌ 15 సెకన్లలో మొత్తం పాసులు క్లెయిమ్‌ చేసుకున్నారని మేకర్స్‌ తెలిపారు. యాక్షన్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్‌(Mohan Lal), సునీల్‌(sunil) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్‌ ఇప్పటికే సినిమాలోని పాత్రలను ఇంట్రడ్యూస్‌ చేస్తూ విడుదల చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. జైలర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్‌ రవి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్‌ జైభీమ్‌ ఫేమ్‌ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Updated On 29 July 2023 6:44 AM GMT
Ehatv

Ehatv

Next Story