✕
హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్‌ను క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు విచారించనున్నారు.

x
హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్‌ను క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు విచారించనున్నారు. పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ(Crypto currency) మోసానికి సంబంధించి తమన్నా, కాజల్‌ను పోలీసులు విచారించనున్నారని సమాచారం. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్‌ను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. అన్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. లాభాలు ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ.2.40కోట్లు వసూలు చేశారని అశోకన్ అనే విశ్రాంత అనే ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని ప్రోత్సహించారని తమన్నా, కాజల్‌పై కూడా ఫిర్యాదులు వచ్చాయి. తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ అందాల భామలను విచారించనున్నారు.

ehatv
Next Story