మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) యంగ్‌ హీరోయిన్లకు ధీటుగా సినిమాలలో ప్రధాన వేషాలు వేస్తున్నారు. ఈ గుజరాతి అమ్మాయి తెలుగులోనే కాదు, తమిళం, హిందీ భాషలలోనూ నటించారు. సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారు. అదే గ్రేస్‌, అదే ఎనర్జీ.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) యంగ్‌ హీరోయిన్లకు ధీటుగా సినిమాలలో ప్రధాన వేషాలు వేస్తున్నారు. ఈ గుజరాతి అమ్మాయి తెలుగులోనే కాదు, తమిళం, హిందీ భాషలలోనూ నటించారు. సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారు. అదే గ్రేస్‌, అదే ఎనర్జీ. మొదటినుంచి గ్లామర్‌ పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు తమన్నా. ఇటీవల రజనీకాంత్‌ హీరోగా వచ్చిన జైలర్‌లో(Jailer) ఓ పాట, ఒకట్రెండు సన్నివేశాలలో మాత్రమే నటించారు. అయినా ఆ చిత్ర ప్రమోషన్‌ అంతా తమన్నా పాటపైనే సాగింది. ఆ పాట బ్రహ్మండమైన విజయాన్ని అధించింది.

సినిమా హిట్‌లో ఆ పాట కూడా ప్రధాన భూమికను పోషించింది. నువ్వు కావాలయ్యా అంటూ తమన్నా చేసిన డాన్స్‌ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ పాటలో తమన్నా హద్దులు మీరి అందాలను ఆరబోసిందని విమర్శలూ వచ్చాయి. ఇదే ప్రశ్నను ఇటీవల ఒక అభిమాని తమన్నాను అడగ్గా ఆమె అతనిపై ఫైర్‌ అయ్యారు. అవకాశాలు తగ్గడంతో ఆ విధంగా అందాలను తెరపై ఆరబోస్తున్నారా(Glamour Exposing) అని నెటిజన్‌ వేసిన ప్రశ్నకు తమన్నా బదులిస్తూ తనకు అవకాశాలు లేవని ఎవరు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పటికీ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పారు.

అంత బిజీగా ఇంతకుముందు ఎప్పుడులేనని కూడా పేర్కొన్నారు. అయినా తన హద్దులు ఏమిటన్నది తనకు తెలుసని తాను ధరించే దుస్తులు ఆయా పాత్రలకు తగ్గట్టుగా ఉంటాయని చెప్పారు తాను పాత్రలు నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తానని, అలా ఒప్పుకున్న తర్వాత ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని తెలిపారు. అరకొర తెలివితో ఇలాంటి ప్రశ్నలు వేయవద్దని హెచ్చరించారు. పెళ్లి ఎప్పుడు అన్న మరో అభిమాని ప్రశ్నకు తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందో అప్పుడు చేసుకుంటానని తమన్నా బదులిచ్చారు.

Updated On 14 Oct 2023 2:56 AM GMT
Ehatv

Ehatv

Next Story