రజనీకాంత్ కథనాయకుడిగా వచ్చిన జైలర్ సినిమాలో తమన్నా పాట సూపర్ డూపర్ హిట్టయ్యింది.

రజనీకాంత్ కథనాయకుడిగా వచ్చిన జైలర్ సినిమాలో తమన్నా పాట సూపర్ డూపర్ హిట్టయ్యింది. వా.. కావాలయ్యా.. దా.. దా అంటూ తమన్నా ఆడి పాడిన పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందులో మిల్కీ బ్యూటీని చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. అందుకే ఈ పాట సోషల్ మీడియాలో బీభత్సం సృష్టించింది. ఇటీవల స్త్రీ 2 సినిమాలో కూడా తమన్నా ఓ చిన్న పాత్ర వేసింది. ఆ సినిమాలో కూడా ఆజ్ కీ రాత్ ( Aaj Ki Raat)అనే పాటతో సందడి చేసింది. ఆ సినిమా కూడా హిట్టయ్యింది. మామూలుగా కాదు, 900 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరేంతగా! దాంతో తమన్న(Tamannaah Bhatia) ఐటమ్‌సాంగ్ చేస్తే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అనే సెంటిమెంట్ వచ్చేసింది. ఆ సెంటిమెంట్‌తోనే తమన్నా ఇంటి ముందర క్యూలు కడుతున్నారు దర్శక, నిర్మాతలు. తమ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమంటూ బతిమాలుతున్నారు. దాంతో తమన్నా అసహనం వ్యక్తం చేసింది. ' నా పాటలు ఆ సినిమాలు హిట్టవ్వడానికి దోహదపడటం ఆనందంగానే ఉంది. అలాగని వరుసగా ఐటమ్ సాంగ్స్ చేయమనడం తప్పు. రజనీకాంత్ సినిమా కాబ్టటే జైలర్‌లో ఆ పాటను ఇష్టంతో చేశాను. స్త్రీ 2 దర్శకుడు అమర్ కౌశిక్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అతడు అడగ్గానే కాదనలేకపోయాను. అంతే తప్ప అదే పనిగా ఇలాంటి పాటలు చేయడానికి నేను ఐటమ్ గర్ల్‌ను కాదు' అని గట్టిగా చెప్పేశారు తమన్నా!
