ఇంత వయసు వచ్చినా తమన్నా భాటియా(Tamannaah) అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. అదే పాలమీగడ సొగసు.. అసలు తమన్నా అంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఆమె డాన్స్‌(dance). డాన్స్‌ సన్నివేశాలలో ఆ ఎనర్జీ, ఆ గ్రేస్‌ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఇది తమన్నా ఫ్యాన్స్‌ అభిప్రాయం. పాపం ఇప్పుడు అవే కళ్లతో ఘోరం చూడాల్సి వస్తున్నదని వాపోతున్నారు.

ఇంత వయసు వచ్చినా తమన్నా భాటియా(Tamannaah) అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. అదే పాలమీగడ సొగసు.. అసలు తమన్నా అంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఆమె డాన్స్‌(dance). డాన్స్‌ సన్నివేశాలలో ఆ ఎనర్జీ, ఆ గ్రేస్‌ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఇది తమన్నా ఫ్యాన్స్‌ అభిప్రాయం. పాపం ఇప్పుడు అవే కళ్లతో ఘోరం చూడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. లస్ట్‌ స్టోరీస్‌ 2(Lust Stories-2) వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌లో తమన్నా చాలా బోల్డ్‌గా నటించారు. రెచ్చిపోయి నటించారు. అశ్లీల సన్నివేశాలలో తమన్నా నటించడం చూసి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

రీసెంట్‌గా లస్ట్‌ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌పై తమన్నా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లస్ట్ స్టోరీస్‌ మొదటి సీజన్‌ చూసిన తర్వాత తన అభిప్రాయం మారిపోయిందన్నారు. ప్రేక్షకులు ఇలాంటి వాటినే చూస్తున్నారని తెలిపారు. ఇలాంటివి చూడటం నిషేధించాలని, లేదంటే ఇలాంటివి చూసేందుకు సిగ్గుపడాలని కొందరు అంటున్నారని, ఇలాంటి ధోరణి నెమ్మదిగా కనుమరుగవుందని తమన్నా అభిప్రాయపడ్డారు. ' కాలంతో పాటు మనం కూడా మారుతున్నాం. నాకు తెలిసిన వారంతా కూడా లస్ట్‌ స్టోరీస్‌ మొదటి సీజన్‌ చూశారు.

అంతేనా.. చూసి ఎంజాయ్‌ చేశారు కూడా!' అని తమన్నా వివరించారు. 'నన్ను జనాలు ఇంతవరకు ఎలాగైతే చూడలేదో దాన్ని ప్రజెంట్‌ చేయడం కూడా నటిగా నాకు అవసరమే! నటిగా నేను ఏదైనా చేయగలను అని నిరూపించాలన్న ఆకలితో ఉన్నాను. ఇప్పటివరకు నేను శృంగార సన్నివేశాలకు ఓకే చెప్పలేదు. కానీ ఇది కూడా ఇతర సన్నివేశాలలాంటిదేనని ఆలస్యంగా తెలుసుకున్నాను. అది కూడా కొరియోగ్రఫీ చేసిందే కదా! అయినా శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు భయం వేయలేదు. నా ప్రియుడు విజయ్‌ వర్మ(Vijay varma) నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు' అని చెప్పుకొచ్చారు తమన్నా..

Updated On 24 Jun 2023 1:24 AM GMT
Ehatv

Ehatv

Next Story