మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) నటించిన సినిమా దటీజ్ మహాలక్ష్మి(That Is Mahalakshmi ). అసలు ఇలాంటి ఓ సినిమా ఉన్నదన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది విడుదల కాలేదు కాబట్టి. సినిమా పూర్తయ్యి ఎనిమిదేళ్లు అవుతున్నా థియేటర్లలోకి రాలేదు. అంచేత నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు.

That Is Mahalakshmi Movie
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) నటించిన సినిమా దటీజ్ మహాలక్ష్మి(That Is Mahalakshmi ). అసలు ఇలాంటి ఓ సినిమా ఉన్నదన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది విడుదల కాలేదు కాబట్టి. సినిమా పూర్తయ్యి ఎనిమిదేళ్లు అవుతున్నా థియేటర్లలోకి రాలేదు. అంచేత నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత వర్మ దర్శకత్వం వహించాడు. కంగనా రనౌత్ హిందీ సినిమా క్వీన్ ఆధారంగా దటీజ్ మహాలక్ష్మిని నిర్మించారు. 2014లో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. 2016లో షూటింగ్ పూర్తి చేసుకుంది. సౌత్ రీమేక్ రైట్స్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా సినిమా విడుదల కాలేదు. సినిమా రిలీజ్ కాకపోవడంతో దటీజ్ మహాలక్ష్మిని ప్రేక్షకులు కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయి ఇప్పటికే ఎనిమిదేళ్లు కావడంతో థియేటర్లలో విడుదల చేస్తే ప్రేక్షకులు ఆదరించడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ రానుంది. ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ జొన్నలగడ్డ సిద్దు ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. ఇంతకు ముందు కూడా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు వార్తలు వచ్చాయి.
