మిల్కీ బ్యూటీ తమన్న(Tamannaah) ఇప్పటికీ హీరోయిన్‌గా వెండితెరపై వెలుగులు పంచుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు మరోసారి అజిత్‌ (Ajith)సరసన నటించే ఛాన్స్‌ కొట్టేశారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ సోషల్‌ మీడియాలో మాత్రం కథనాలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరు కలిసి నటించిన వీరం(Veeram) సినిమా ఘన విజయం సాధించింది.

మిల్కీ బ్యూటీ తమన్న(Tamannaah) ఇప్పటికీ హీరోయిన్‌గా వెండితెరపై వెలుగులు పంచుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు మరోసారి అజిత్‌ (Ajith)సరసన నటించే ఛాన్స్‌ కొట్టేశారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ సోషల్‌ మీడియాలో మాత్రం కథనాలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరు కలిసి నటించిన వీరం(Veeram) సినిమా ఘన విజయం సాధించింది. కాగా అజిత్‌ నటించిన తుణివు సినిమా (తెలుగులో తెగింపు) విడుదలై చాలా కాలం అవుతోంది. ఈ చిత్రంతో పాటుగా విజయ్‌ నటించిన వారిసు సినిమా విడుదలయ్యింది. వారిసు తర్వాత విజయ్‌ నటిస్తున్న లియో(LEO) చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని దీపావళికి విడుదల కాబోతున్నది. అజిత్‌ సినిమా మాత్రం ఇంకా సెట్స్‌ పైకి వెళ్లలేదు. ఈ సినిమాకు విడాముయిర్చి అనే పేరును ఖరారు చేశారు.

లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించాల్సింది. కారణాలు తెలియవు కావు కానీ ఈ సినిమా నుంచి విఘ్నేశ్‌ను తొలగించి దర్శకుడు మగిళ్‌ తిరుమేణిని ఎంపిక చేశారు. తర్వాత ఈ చిత్రం మే నెలలో ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తాజాగా ఆగస్ట్‌లో విడాముయిర్చి సెట్స్‌పైకి వెళ్లడం ఖాయం అంటున్నారు. కాగా ఇందులో నటి త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే సినిమా షూటింగ్‌ పలుమార్లు వాయిదా పడుతుండటంతో ప్రస్తుతం విజయ్‌కు జంటగా లియో చిత్రాన్ని పూర్తి చేసిన త్రిషకు తెలుగు, మలయాళం భాషల్లో అవకాశాలు వచ్చాయి. మలయాళంలో నటుడు టోవినో థామస్‌కు జంటగా ఐడెంటీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. దీంతో అజిత్‌ సరనస నటించే అవకాశం లేనట్టే... ఇకపోతే హీరోయిన్‌ తమన్న ప్రస్తుతం రజనీకాంత్‌ సరసన జైలర్‌ చిత్రంలో నటించి పూర్తి చేశారు. కాగా ఇందులోని కావాలయా అనే పాటను ఇటీవల సినిమా వర్గాలు విడుదల చేశారు.
ఆ పాటలో తమన్న కవ్వింపు డాన్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అంతే కాదు ఈ పాట ఈ మిల్కీబ్యూటీకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనేది తాజా సమాచారం. అందులో ఒకటి అజిత్‌ సరసన నటించే విడాముయిర్చి అనే ప్రచారం జరుగుతోంది. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Updated On 20 July 2023 2:53 AM GMT
Ehatv

Ehatv

Next Story