సాధారణంగా తమన్నా భాటియాకు(Tamannaah Bhatia) ఫ్యాన్స్‌లో సరదాగా మాట్లాడతారు. ఫ్యాన్స్‌తో ఎప్పుడూ చికాకు పడింది చూడలేదు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కనలేదు. కానీ ఇప్పుడు తమన్నాకు కోపం వచ్చేసింది. ఇటీవల చెన్నైలో(Chennai) తమన్నా ఫ్యాన్స్ మీట్‌లో(Fans Meet) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమన్నాను ప్రశ్నలపై ప్రశ్నలు అడిగారు. ప్రతి ప్రశ్నకు తమన్నా చాలా ఓపిగ్గా, చలాకీగా సమాధానాలు ఇచ్చారు.

Tamannaah Bhatia
సాధారణంగా తమన్నా భాటియాకు(Tamannaah Bhatia) ఫ్యాన్స్‌లో సరదాగా మాట్లాడతారు. ఫ్యాన్స్‌తో ఎప్పుడూ చికాకు పడింది చూడలేదు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కనలేదు. కానీ ఇప్పుడు తమన్నాకు కోపం వచ్చేసింది. ఇటీవల చెన్నైలో(Chennai) తమన్నా ఫ్యాన్స్ మీట్‌లో(Fans Meet) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమన్నాను ప్రశ్నలపై ప్రశ్నలు అడిగారు. ప్రతి ప్రశ్నకు తమన్నా చాలా ఓపిగ్గా, చలాకీగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని మీపై వచ్చే నెగెటివ్ ప్రచారాలపై మీరెలా స్పందిస్తారు? అని అడిగారు. దానికి తమన్నా చక్కటి సమాధానం చెప్పారు. ' విమర్శించడం, ప్రశంసించడం వ్యక్తిగతానికి సంబంధించిన అంశాలు.
వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే మరీ ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ఫీలవుతా? అంతకంటే ఏం చేయలేంకదా' అని అన్నారు. ఇంతలో మరొక యువకుడు మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు. మీకు తమిళనాడు అబ్బాయిలు నచ్చరా? అని అడిగాడు. ఈ తుంటరి ప్రశ్నకు తమన్నా కాసింత అసహనానికి లోనయ్యారు. కొంచెం కోపం కూడా వచ్చిందామెకు! “నా లైఫ్ ప్రస్తుతం బావుంది. హ్యాపీగా ఉన్నాను. నచ్చడం నచ్చకపోవడం నా సొంత విషయం. అది మీకు అనవసరం కదా! నా తల్లిదండ్రులు కూడా నన్నెప్పుడూ ఇలా అడగలేదు’ అంటూ సున్నితంగా మందలించారు.
