రజనీకాంత్‌(Rajinikanth) హీరోగా నటించిన జైలర్‌ సినిమా(Jailer Movie) సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని నువ్వు కావాలయ్య పాట అయితే అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది. సాధారణ ప్రజలే కాదు, ఇతర రంగాలలోని సెలెబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు.

రజనీకాంత్‌(Rajinikanth) హీరోగా నటించిన జైలర్‌ సినిమా(Jailer Movie) సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని నువ్వు కావాలయ్య పాట అయితే అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది. సాధారణ ప్రజలే కాదు, ఇతర రంగాలలోని సెలెబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. పాట ఇంత పెద్ద హిట్టవ్వడానికి అనిరుధ్‌(Anirudh) సంగీతం ప్రధాన కారణం. దాంతో పాటు నటి తమన్నా భాటియాకు కూడా పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. ఈ ఐటమ్‌ సాంగ్‌లో తమన్నా(Tamannaah) తన డ్యాన్సుతో అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ పాటలో తమన్నా డ్యాన్స్‌, అందం, అభినయం, కవ్వింపుతనం యూత్‌కు కిరాక్‌ను తెప్పించింది. చిత్ర యూనిట్‌ ఈ పాటనే ప్రమోషన్‌కు ఎక్కువగా వాడుకుంటోంది. ఇప్పటికే ఆ పాట కోట్లాది సంగీత ప్రియులను అలరించిందని గణాంకాలు చెబుతున్నాయి. యూట్యూబ్‌లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. అంతేకాదు, తమన్నా పేరు మార్మోగిపోయేలా చేసింది. కావాలయ్యా పాట ఈ రేంజ్‌లో సక్సెస్‌ కావడంపై తమన్నా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక మహిళ అబలగా ఉంటే అది ఆమెను ఆత్వవిశ్వాసం లేకుండా చేస్తుందని, అదే ఆత్వవిశ్వాసం కలిగి ఉంటే ఆదే ఆమెకు మరో సొత్తు అవుతుందని తమన్నా తెలిపారు. మహిళలు స్వతహాగా కొన్ని మానసిక భావాలు కలిగి ఉంటారని, అదే తమ ప్రకృతి స్వభావం అని చెప్పారు. తాము ఏ విషయానైనా ఆలోచించకుండా నమ్మేస్తామని, అయితే వాటికి తమ ప్రతిభను కలిపితే అంతకంటే శక్తి మరేమీ ఉండదని తమన్నా భాటియా చెప్పుకొచ్చారు.

Updated On 25 Aug 2023 2:39 AM GMT
Ehatv

Ehatv

Next Story