టాలీవుడ్‌ హీరోయిన్‌ తమన్నా(Tamannaah) గతకొన్ని రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో(Vijay Varma) కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ దొరికేసింది బ్యూటీ. ఇక మరోసారి ఈజంట కెమెరాల కంటికి చిక్కారు.

టాలీవుడ్‌ హీరోయిన్‌ తమన్నా(Tamannaah) గతకొన్ని రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో(Vijay Varma) కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ దొరికేసింది బ్యూటీ. ఇక మరోసారి ఈజంట కెమెరాల కంటికి చిక్కారు.

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) పీకల్లోతు ప్రేమలో ఉందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో(Vijay Varma) ఆమె డేటింగ్ చేస్తున్నట్టు న్యూస్ గత కొద్ది రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఈవార్తలు గుప్పుమన్నాయి. న్యూ ఇయర్‌ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో ఓ సంచలనమే రేపింది. వీరిద్దరూ పలు పార్టీలకు కలిసి వెళ్లినట్లు చాలా సార్లు మీడియా కంట కూడా పడ్డారు. ఇదే విషయాన్ని ఎన్ని సార్లు అడిగినా వీరిద్ధరూ స్పందించలేదు. కాగా తాజాగా ఈ జంట మరోసారి మీడియా కంట పడింది. తాజాగా వీరిద్దరూ మరోసారి కెమెరాల కంటికి చిక్కి హాట్ న్యూస్ అయ్యారు.

ముంబైలో(Mumbai) ఈ తరలిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ లో డిన్నర్ డేట్ కు వెళ్లారు. డిన్నర్ ముగించుకుని ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లిపోయారు. తమన్నా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి.. విజయ్ కారు ఎక్కుతున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీస్తుంటే హాయ్‌ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దాంతో పలువురు నెటిజన్లు వీరిద్ధరూ రిలేషన్‌లో ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ డిన్నర్ డేట్ వ్యావహారంతో వీరిద్దరూ రిలేషన్ షిల్ ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. ఇక తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు దాదాపు ఐదారు సినిమాలు ఉన్నాయి. టాలీవేడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా బోళాశంకర్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇక తమన్నా, విజయ్ లు కలిసి లస్ట్ స్టోరీస్ - 2 లో నటించగా.. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచే ఇద్దరు డేటింగ్ ను కొనసాగిస్తున్నట్టు సమాచారం.

Updated On 25 April 2023 11:25 PM GMT
Ehatv

Ehatv

Next Story