తమిళ సినీ పరిశ్రమంలో ప్రస్తుతం నటి తమన్నా(tamannaah) గురించి బోల్డంత చర్చ జరుగుతోంది. ఈ మిల్కీ బ్యూటీ తమన్నాను ఆడిపోసుకుంటున్నారు చాలా మంది. అసలు తమన్నాకు ఏమైంది అంటూ ఆమెను కార్నర్‌ చేస్తున్నారు. తమన్నా కెరీర్‌ బిగినింగ్‌లో చేసినవన్నీ గ్లామరస్‌ పాత్రలే! కాకపోతే గ్లామరస్‌ పాత్రలలో నటించడానికి కొన్ని హద్దులు పెట్టుకున్నారు తమన్నా. ఇప్పుడు మాత్రం హద్దులు చెరిపేశారు.

తమిళ సినీ పరిశ్రమంలో ప్రస్తుతం నటి తమన్నా(tamannaah) గురించి బోల్డంత చర్చ జరుగుతోంది. ఈ మిల్కీ బ్యూటీ తమన్నాను ఆడిపోసుకుంటున్నారు చాలా మంది. అసలు తమన్నాకు ఏమైంది అంటూ ఆమెను కార్నర్‌ చేస్తున్నారు. తమన్నా కెరీర్‌ బిగినింగ్‌లో చేసినవన్నీ గ్లామరస్‌ పాత్రలే! కాకపోతే గ్లామరస్‌ పాత్రలలో నటించడానికి కొన్ని హద్దులు పెట్టుకున్నారు తమన్నా. ఇప్పుడు మాత్రం హద్దులు చెరిపేశారు. జీ కర్ధా(zee Karda) అనే వెబ్‌ సిరీస్‌లో(Web series) ఆమె అందాలను ఆరబోశారు. అర్ధ నగ్న దుస్తులతో కనిపించారు. శ్రుతిమించిన సన్నివేశాలలో నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌లో లెక్కలేనన్ని డబుల్ మీనింగ్‌ డైలాగులు ఉన్నాయి.

అశ్లీల సన్నివేశాలు కూడా ఎక్కువే. తమన్నా నటించిన బెడ్‌ రూమ్‌ శృంగార సన్నివేశాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం తమన్నా తమిళంలో రజనీకాంత్‌(Rajini Kanth) సరసన జైలర్‌(Jailer) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదల కాబోతున్నది. సరిగ్గా ఇక్కడే జైలర్‌ మేకర్స్ తెర వర్రీ అవుతున్నారు. జీ కర్దా వెబ్‌ సిరీస్‌లో తమన్నా శ్రుతి మించిన ఆందాల ఆరబోతకు తెరలేపడం, విజయ్‌ వర్మతో(Vijay Varma) ప్రేమ వ్యవహారం బయటకు రావడం, లవ్‌ స్టోరీస్‌-2లో(Love Story-2) కూడా మితిమీరిన రొమాన్స్‌ సీన్స్‌ ఉండటం.. ఇవన్నీ జైలర్‌ చిత్ర యూనిట్‌కు షాక్‌నిస్తున్నాయి.

కొంపదీసి ఈ ఎఫెక్ట్ తమ సినిమాపై పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. నటీమణులు ఇప్పుడు డబ్బు కోసం ఎలాంటి పాత్రనైనా , ఎలాగైనా నటించడానికి రెడీ అవుతున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా కొందరు హద్దులు మీరి అందాల ఆరబోశారని, కాకపోతే తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో నటిస్తున్న తమన్నా ఇలాంటి వెబ్‌ సిరీస్‌లలో నటించడం మంచిది కాదని చాలా మంది అంటున్నారు. మరి ఈ విమర్శలకు తమన్నా రియాక్టవుతారో లేక లైట్‌ తీసుకుంటారో చూడాలి.

Updated On 20 Jun 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story