స్త్రీ -2(Stree2) సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్‌ వచ్చేసింది. ఆజ్‌ కీ రాత్‌ (Aaj Ki Raat)అనే ఆ పాట సినిమా రిలీజ్‌ కాకముందే రీల్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో మోత మోగిస్తోంది.

స్త్రీ -2(Stree2) సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్‌ వచ్చేసింది. ఆజ్‌ కీ రాత్‌ (Aaj Ki Raat)అనే ఆ పాట సినిమా రిలీజ్‌ కాకముందే రీల్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో మోత మోగిస్తోంది. నిజానికి ఈ పాటను డాన్స్‌ చేయాల్సింది నోరా ఫతేహీ(Nora Fatehi)..ఎంతుకంటే స్త్రీ-1లోని స్పెషల్ సాంగ్‌కు డాన్సులు చేసింది నోరా ఫతేహీనే! ఎందుకో మూవీ మేకర్స్‌కు స్త్రీ-2లో కూడా ఆమెతో స్టెప్పులు వేయించడానికి ఇష్టపడలేదు. ఆమె స్థానంలో తమన్నాను తీసుకున్నారు. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ బాగా వర్కవుటయ్యింది. అసలు సినిమాకు అంత హైప్‌ వచ్చిందంటే అందుకు కారణం తమన్నా చేసిన ఆజ్‌ కీ రాత్‌ పాటే! యూ ట్యూబ్‌లో ఇప్పటికే కోటి మందికి పైగా ఈ పాటను చూశారు. ఇంతకు ముందు నోరా ఫతేహికి ఐటెం సాంగ్‌కు పాతిక లక్షల రూపాయలు ఇచ్చారు. అయితే పార్ట్‌-2లో చేసిన తమన్నాకు ఏకంగా కోటి రూపాయలు ఇచ్చారు. కోటి రూపాయలు తీసుకుంటే తీసుకున్నది కానీ డాన్స్‌ మాత్రం ఇరగదీసింది. స్త్రీ -2 సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది.

ehatv

ehatv

Next Story