పంజాబీ సుందరి తాప్సీ పన్ను(Thapsi Pannu) మొదట చేసింది తెలుగు సినిమానే! కెరీర్ మొదట్లో ఆమె దక్షిణాది సినిమాలతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లారు. అక్కడ ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక కథాంశాలతో హిందీ చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తాప్సీ హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
పంజాబీ సుందరి తాప్సీ పన్ను(Taapsee Pannu) మొదట చేసింది తెలుగు సినిమానే! కెరీర్ మొదట్లో ఆమె దక్షిణాది సినిమాలతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లారు. అక్కడ ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక కథాంశాలతో హిందీ చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తాప్సీ హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా నటిస్తున్నారు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాటి సంగతులను చెప్పుకొచ్చారు. సినిమాలు ఫ్లాప్ అయితే తనను బాధ్యురాలిగా చేసి నిందించారని ఆవేదన వ్యక్తం చేశారు తాప్సీ. తెలుగులో తాను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయని, దాంతో తనపై ఐరన్‌లెగ్ ముద్ర వేశారని తాప్సీ అన్నారు. ' నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సినిమాల ఎంపికపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. దాంతో సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాను. సినిమా ఆడకపోతే హీరోయిన్‌ను ఎందుకు నిందిస్తారో అర్థమయ్యేది కాదు. హీరోయిన్ ఏవో కొన్ని సన్నివేశాలు, పాటల వరకే పరిమితం. అంతకు మించి వారు చేయగలిగిందేమీ ఉండదు. అలాంటప్పుడు వారిపై ఫెయిల్యూర్ బాధ్యత మోపడం మంచిది కాదు. నా విషయంలో అదే జరిగింది. అయితే ఆ చేదు అనుభవాలను నుంచి తొందరగా బయటపడ్డాను. హిందీలో మంచి కథలపై దృష్టి పెట్టాను. అక్కడ విజయం సాధించాను. హిందీలో నేను చేసిన సినిమాలన్నీ నటిగా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి' అని తాప్సీ పన్ను అన్నారు.