సౌత్ సినిమా(South Movie)ల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది పంజాబీ భామ తాప్సీ పన్ను(Taapsee Pannu). ఆతరువాత బాలీవుడ్(Bollywood) చేరిన బ్యూటీ.. సౌత్ పై కడుపు మంట పెంచుకోవడంతో పాటు.. కామెంట్లు కూడా చేస్తోంది. మరోసారి సౌత్ పై అక్కసు వెళ్లగగ్గింది బ్యూటీ. సౌత్ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన హీరోయిన్ తాప్సీ.. ఆ తరువాత బాలీవుడ్ చేరింది. అక్కడ అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకుంది తాప్సీ.. సౌత్ ను వదిలి బాలీవుడ్ చేరిన ఆమె పదే పదే పదే సౌత్ చిత్ర పరిశ్రమను తక్కువ చేస్తూ..
సౌత్ సినిమా(South Movie)ల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది పంజాబీ భామ తాప్సీ పన్ను(Taapsee Pannu). ఆతరువాత బాలీవుడ్(Bollywood) చేరిన బ్యూటీ.. సౌత్ పై కడుపు మంట పెంచుకోవడంతో పాటు.. కామెంట్లు కూడా చేస్తోంది. మరోసారి సౌత్ పై అక్కసు వెళ్లగగ్గింది బ్యూటీ.
సౌత్ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన హీరోయిన్ తాప్సీ.. ఆ తరువాత బాలీవుడ్ చేరింది. అక్కడ అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకుంది తాప్సీ.. సౌత్ ను వదిలి బాలీవుడ్ చేరిన ఆమె పదే పదే పదే సౌత్ చిత్ర పరిశ్రమను తక్కువ చేస్తూ.. కామెంట్లు విసురుతోంది. తాజాగా మరోసారి సౌత్ ఇండస్ట్రీపై తన కోపాన్ని వెళ్ళగక్కింది బ్యూటీ.
గతంలో కూడా సౌత్ సినిమాల్లో తనకు గౌరవం దక్కలేదంటూ కాంట్రవర్సియల్ కామెంట్స్(Controversial Comments) చేసింది తాప్సీ. తనను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) పై కూడా ఫైర్ అయ్యింది తాప్సీ.. హీరోల డామినేషన్ సౌత్ లో ఎక్కువ అంటోంది. తాజాగా మరోసారి సౌత్ పై కామెంట్లు చేసింది బ్యూటీ. నెటిజన్ల చేత తిట్లు కూడా తింటోందతి.
తాప్సి బాలీవుడ్ లో కి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం చష్మే బద్దూర్(Chashme Baddoor) ఇటీవల పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాప్సి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాప్సి బాలీవుడ్ లో తన కెరీర్ పై సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో నాకు దక్కిన గుర్తింపు ..చేస్తున్నసినిమాల పట్ల చాలా సంతోషంగా ఉన్నానంటోంది. బాలీవుడ్ సినిమాలు నటిగా నన్ను మరోస్థాయికి చేర్చాయి. అంతకు ముందు నేను సౌత్ లో నటించినప్పటికీ ఆ సినిమాల వల్ల నేను సంతృప్తి చెందలేదు అన్నది తాప్సి. ఇక్కడ సినమాలు కూడా తనకు గుర్తింపు తేలేదంటోంది.
దీనితో నెటిజన్లు తాప్సి పై మండిపడుతున్నారు. సౌత్ లోనే తాప్సి ఎదిగింది. ఎక్కువగ గ్లామర్ రోల్స్ వచ్చింది కూడా సౌత్ లోనే. స్టార్ హీరోల పక్కన కూడా అవకాశం వచ్చింది సౌత్ లోనే.. బాలీవుడ్ లో ఏ స్టార్ హీరోతో నువ్వు సినిమాలు చేశావ్ అంటూ.. తాప్సీని ప్రశ్నిస్తున్నారు సౌత్ ఆడియన్స్. బాలీవుడ్ లో ఆమెని మించిన స్టార్ బ్యూటీలు చాలా మందే ఉన్నారు. కాబట్టి ఆమెకి అక్కడ గ్లామర్ రోల్స్ దక్కలేదు. దీనితో ఆమెకి కంటెంట్ ఓరియెంటెడ్ కథలు ఎంచుకోక తప్పలేదు.