చాలా కాలంగా హీరోయిన్ తాప్సీ(Taapsee) ఓ ఫారెనర్ తో డేటింగ్(Dating) లో ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆమె తన సోషల్ మీడియాలో(Social media) కూడా అతనితో షికార్లు చేసిన ఫోటోలు.. వీడియోలు పంచుకున్నారు. కాని ఎప్పుడూ అఫీషియల్ గా బయట పడలేదు. ఇక తాజాగా అసలు విషయం వెల్లడించింది తాప్సీ. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..?

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ గురించి పలు విషయాలను వెల్లడించింది. తాను డెన్మార్క్(Denmark) బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్(Mathis) బోతో తాను దాదాపు పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నానని తాప్సీ తెలిపింది. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టే సమయంలో అతనితో పరిచయం ఏర్పడిందని... ఇన్నేళ్లుగా తమ బంధం బలపడుతూ వచ్చిందని చెప్పింది. అతనికి బ్రేకప్ చెప్పి మరో బంధంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా తనకు ఎప్పుడూ రాలేదని తెలిపింది.

అయితే ఇన్నాళ్ళు ఎందుకు పెళ్ళి చేసుకోలేదంటే.. ప్రేమ, పెళ్లి గురించి తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని... అందుకే తమ ప్రేమ గురించి ఇప్పటి వరకు తాను ఎక్కడా మాట్లాడలేదని చెప్పింది. మాథిస్ వల్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. పెళ్ళి చేసుకుంటుందా..? లేక ఇలా సహజీవనం చేస్తుందా అన్నదానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ.. ఇక్కడ పెద్దగా ఆదరణ లేకపోవడంతో బాలీవుడ్ గుమ్మం తొక్కింది. . టాలీవుడ్ లో 'ఝుమ్మంది నాదం' సినిమా ఆమెకు తొలి సినిమా. టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది తాప్సీ.. బాలీవుడ్ లో కూడా పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ లో నటించి మెప్పించింది. విమెన్ సెంట్రిక్ మూవీ, బయోపిక్ మూవీస్ కూడా చేసి బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సాధించింది.

Updated On 20 Jan 2024 7:51 AM GMT
Ehatv

Ehatv

Next Story