ఒకప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishna Reddy) తిరుగులేని డైరెక్టర్‌. వరుస హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోయాడు. కుటుంబగాధ చిత్రాలు తీయడంలో ఎక్స్‌పర్ట్. అలాగే ఆయన సినిమాలలో సునిశితమైన హాస్యం ఉంటుంది. భావోద్వేగాలు సరేసరి! ఆయన రూపొందించిన సినిమాలలో యమలీల(Yamaleela) ఓ సంచలనం. ప్రధాన కేంద్రాలలో ఏడాది పాటు ఆడింది. అలాగే మాయలోడు కూడా సెన్సేషనల్ హిట్‌. ఇది కూడా కొన్ని కేంద్రాలలో సంవత్సరం పాటు ఆడింది. ఇందులో చినుకు చినుకు పాట అప్పట్లో పెద్ద సంచలనం.

ఒకప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishna Reddy) తిరుగులేని డైరెక్టర్‌. వరుస హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోయాడు. కుటుంబగాధ చిత్రాలు తీయడంలో ఎక్స్‌పర్ట్. అలాగే ఆయన సినిమాలలో సునిశితమైన హాస్యం ఉంటుంది. భావోద్వేగాలు సరేసరి! ఆయన రూపొందించిన సినిమాలలో యమలీల(Yamaleela) ఓ సంచలనం. ప్రధాన కేంద్రాలలో ఏడాది పాటు ఆడింది. అలాగే మాయలోడు కూడా సెన్సేషనల్ హిట్‌. ఇది కూడా కొన్ని కేంద్రాలలో సంవత్సరం పాటు ఆడింది. ఇందులో చినుకు చినుకు పాట అప్పట్లో పెద్ద సంచలనం. సౌందర్యతో బాబూ మోహన్‌ ఆడి పాడమంటే గొప్పే కదా! మూడు దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆ పాట చాలా మందికి గుర్తుంది. ఈ సినిమా విజయవంతంలో ఈ పాట కీలకపాత్ర పోషించింది. చాలా మంది ప్రేక్షకులు ఈ పాట కోసమే సినిమాకు వెళ్లేవారు. ఈ పాట పూర్తి కాగానే థియేటర్ల నుంచి వెళ్లిపోయేవారు. ఇదే పాటను మళ్లీ శుభలగ్నం సినిమాలో ఆలీ, సౌందర్యతో తెరకెక్కించారు.

నిజానికి ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌(Rajendra Prasad) హీరో.. పాట కూడా ఆయనతోనే తీయాలి. మరి కమెడియన్‌తో పాట ఎందుకు తీశారు? అన్న అనుమానం చాలా మందికి కలిగింది. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆ సందేహాన్ని తీర్చారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. మాయలోడు సినిమా నిర్మాణ సమయంలో రాజేంద్రప్రసాద్‌ బాగా టార్చర్‌ పెట్టాడట! రాజేంద్రప్రసాద్‌ సరైన సహకారం ఇవ్వకపోవడంవల్లే ఆ పాటను బాబూమోహన్‌తో తీయాల్సి వచ్చిందని కృష్ణారెడ్డి తెలిపాడు. మాయలోడు సినిమా పూర్తి కానున్న సమయంలో రాజేంద్రప్రసాద్‌ బాగా ఇబ్బంది పెట్టాడట! 'నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా...నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా అంటూ వెటకారంగా మాట్లాడాడు. ఇంకా ఏదేదో అన్నాడు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. సినిమా పూర్తి అవుతుందని అనుకున్నసమయంలో రాజేంద్రప్రసాద్‌ డేట్స్‌ తక్కువ కావడంతో అదనపు డేట్స్‌ కోసం అడిగితే అస్సలు సహకరించలేదు. ఎలాగైనా పాట చిత్రీకరణ పూర్తి చేయాలనుకుని ఆయనను బతిమాలుకున్నాము. వేడుకున్నాం. అయినా ఉపయోగం లేకుండాపోయింది. ఫైనల్‌గా రాజేంద్రప్రసాద్‌తో మిగిలిన డేట్స్‌తో డబ్బింగ్‌ కూడా పూర్తి చేయించాను.

అది కూడా సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్‌ పత్రాలను అతడి మేనేజర్‌ చూసిన తర్వాతే డబ్బింగ్‌ చెప్పాడు. ఒక రోజులో ఎలాగూ డ‌బ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుంద‌ని రాజేంద్రప్రసాద్‌ భావించాడు. సినిమా మొత్తం 1200 అడుగుల రీల్‌ వస్తే, ఎడిటర్‌ను రిక్వెస్ట్‌ చేసి, మొత్తం ఒకే రీల్‌గా మార్చాను. ఆ విషయం రాజేంద్రప్రసాద్‌కు తెలియదు. దాంతో మధ్యాహ్నం ఒంటిగంటకే డబ్బింగ్‌ పూర్తి అయ్యింది. అందరూ ఆశ్చర్యపోయారు. రాజేంద్రప్రసాద్‌ అయితే బిత్తరపోయాడు. అయినా ఇంకా పాట చేయాలి కదా. ఎలా చేస్తావో చూస్తా అని అన్నాడు. ఆ తర్వాత పాట షూటింగ్‌కు రమ్మని పిలిస్తే, నాకు కుదరదయ్యా.. సౌందర్య డేట్స్‌ ఇచ్చిందన్నావు కదా చేసుకో పో అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు' అని కృష్ణారెడ్డి చెప్పారు.

రాజేంద్రప్రసాద్‌ కాదు కూడదన్నాక ఇక ఆయనను బతిమాలడం వేస్టనుకున్నాము. వెంటనే ఆ పాటను బాబూమోహన్‌తో తీయాలని డిసైడయ్యాము. బాబూమోహన్‌కు విషయం చెప్పి ఒప్పించాము. బాబుమోహన్‌(Babu mohan), సౌందర్యతో(Soundharya) పాట‌ తీస్తున్న విష‌యం రాజేంద్రప్రసాద్‌కు తెలిసింది. కొందరు మధ్యవర్తులను నా దగ్గరకు పంపించాడు. పాట షూటింగ్‌కు రాజేంద్రప్రసాద్‌ సిద్ధమేనని వారుచెప్పారు. ఇక నాకు అతడి అవసరం లేదని , ఆల్‌రెడీ బాబూ మోహన్‌కు మాట ఇచ్చేశానని బదులిచ్చాను. దాంతో మరో మాట లేకుండా వెళ్లిపోయారు. కావాలంటే రాజేంద్ర‌ప్ర‌సాద్ షూటింగ్‌ స్పాట్‌ వద్దకు రావొచ్చ‌ని, చూసి వెళ్లొచ్చ‌ని వారితో చెప్పాను'అంటూ ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు ఎస్‌.వి.కృష్ణారెడ్డి. చిత్రపరిశ్రమలో తాను ద‌ర్శ‌కుడిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజేంద్ర ప్ర‌సాద్ అని ఎస్వీ కృష్ణారెడ్ఢి చెప్పారు. తన సినీ ప్రయాణంలో రాజేంద్ర ప్రసాద్‌ స‌హ‌కారం ఎంతో ఉంద‌ని తెలిపారు. కానీ మాయ‌లోడు సినిమా విష‌యంలో మాత్రం త‌నను రాజేంద్ర‌ప్ర‌సాద్ తీవ్రంగా బాధపెట్టారన్నారు. లాస్టియర్‌ రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన భూమికలో ఆర్గానిక్‌ మామ ..హైబ్రిడ్‌ అల్లుడు అనే సినిమాకు ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు.

Updated On 5 Feb 2024 6:03 AM GMT
Ehatv

Ehatv

Next Story