తెలుగు తమిళ చలన చిత్ర పరిశ్రమ లో క్రేజ్ ఉన్న కపుల్ సూర్య -జ్యోతిక .తాజాగా వీరిద్దరూ 2డి అనే నిర్మాణ సంస్థను స్థాపించటం జరిగింది .గతం లో సూర్య కూడా నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో వీర్‌ ,వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ చిత్ర షూటింగ్స్ తో బిజీ గా ఉన్నారు . మరో వైపు జ్యోతిక కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయడానికి తన అందానికి మరింత మెరుగులు […]

తెలుగు తమిళ చలన చిత్ర పరిశ్రమ లో క్రేజ్ ఉన్న కపుల్ సూర్య -జ్యోతిక .తాజాగా వీరిద్దరూ 2డి అనే నిర్మాణ సంస్థను స్థాపించటం జరిగింది .గతం లో సూర్య కూడా నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో వీర్‌ ,వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ చిత్ర షూటింగ్స్ తో బిజీ గా ఉన్నారు . మరో వైపు జ్యోతిక కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయడానికి తన అందానికి మరింత మెరుగులు దిద్దేలా జిమ్ చేస్తున్న వీడియోస్ ఆ మధ్య సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి.

తాజాగా సూర్య జ్యోతిక లు సూర్య కుటుంబం తో విడిపోయి ముంబై మకాం మార్చినట్లు పుకార్లు గట్టిగా వినబడుతున్నాయి. 2006 లో జ్యోతిక సూర్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు . ఈ ప్రేమ పెళ్ళికి మొదట్లోనే సూర్య తండ్రి శివ కుమార్ అభ్యంతరం తెలిపడం జరింగింది. ఆ తరువాత సినిమాల్లో జ్యోతిక ఇక పైన నటించబోదు అన్న విషయాన్నీ ఆయనే స్వయంగా మీడియా ముందు ప్రకటించారు. ఈ విషయం పై తండ్రి కొడుకలకు ఎప్పటినుండో వాదనలు జరుగుతున్నాయట. తాజాగా జ్యోతిక మల్లి సినిమాల్లో నటించటం వలన శివకుమార్ దీనికి అభ్యంతరం చెప్పడంతో కుటుంబానికి వేరుగా సూర్య బయటకు రావటం జరిగిందని తెలుస్తుంది . ఈ విషయాన్ని తమిళ నటుడు బైల్వాన్‌ రంగనాథన్‌ వెల్లడించారు .

పెళ్లి అయిన తరువాత జ్యోతిక సినిమాలకి దూరంగానే ఉంది. సూర్య జ్యోతిక లకు ఇద్దరు పిల్లలు . ఉమ్మడి కుటుంబం లోనే వీరి ఇప్పటి వరకు కొనసాగారు . జ్యోతిక సూర్య జంటకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవాలి . రీల్‌ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లోనూ సక్సెస్‌ఫుల్ జంటగా నిలిచారు సూర్య, జ్యోతిక.రీసెంట్ గా వీరు ముంబై లో కొత్త ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. కొత్తగా మొదలు పెట్టిన 2డ్ నిర్మాణ సంస్థ వ్యవహారాలు కూడా అక్కడి నుండే నిర్వహించబోతున్నారని సమాచారం .

Updated On 3 March 2023 2:04 AM GMT
Ehatv

Ehatv

Next Story