సుర్వీన్ చావ్లా ఈ భామ 2009లో మోహన్ బాబు, శర్వానంద్ నటించిన ‘రాజు మహారాజు’ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. ఆ తర్వాత తెలుగులో ఎక్కడ కనిపించలేదు ఈ భామ.
ఇక ఆ తర్వాత పంజాబీ, హిందీ, తమిళ్ సినిమాలు చేస్తూ బిజి అయిపోయింది ఈ అమ్మడు. సుర్వీన్ చావ్లా హిందీ సినిమా ‘హేట్ స్టోరీ-2’తో ఆడియన్స్ లో క్రేజ్ పెంచుకుంది.
అయితే ఈ భామ 1984 ఆగస్టు 1న ఛండీగఢ్ లో జన్మించారు. తన కెరీర్ టీవీ సీరియళ్ల ద్వారా ప్రారంభించింది. ‘అగ్లీ’, ‘పార్చెద్’, 24 వంటి సినిమాలతో నటిగా జనాల్లో బాగా ముద్రపడిపోయింది.
సుర్వీన్ తొలిసారిగా ‘కహీతో హోగా’ అనే సీరియల్ తో టెలివిజన్ కు పరిచయం అయింది. ఇక 2018లో అల్త్ బాలాజీ వెబ్ సిరీస్ లోనూ నటించింది.
ఈమె టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ లు చేస్తున్న సుర్వీన్ ఇప్పుడు రానా, వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో నైనా క్యారెక్టర్ చేసింది. ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది.
ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె ధరించిన వైట్ బ్రాలెట్ కనిపిస్తూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫొటోలకు రకరకాలుగా కమెంట్స్ ఒస్తున్నాయి. మరోవైపు నెటిజన్లు సుర్వీన్ హాట్ పిక్స్ అంటూ వైరల్ చేస్తున్నారు. ఈమెకు ఇన్ స్టా గ్రామ్ లో 1.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.