ఇటీవల అమెరికాలో(america) దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య(Thatikonda Aishwarya) అనే యువతి చనిపోయిన సంగతి తెలిసిందే! ఈ నెల 7వ తేదీన టెక్సాస్‌లోని(Texas) ఓ షాపింగ్‌ మాల్‌లోకి ఓ దుండగుడు ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. ఇందులో మన నగరానికి చెందిన ఐశ్వర్య కూడా ఉంది.

ఇటీవల అమెరికాలో(america) దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య(Thatikonda Aishwarya) అనే యువతి చనిపోయిన సంగతి తెలిసిందే! ఈ నెల 7వ తేదీన టెక్సాస్‌లోని(Texas) ఓ షాపింగ్‌ మాల్‌లోకి ఓ దుండగుడు ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. ఇందులో మన నగరానికి చెందిన ఐశ్వర్య కూడా ఉంది. ఈ అమ్మాయి తమిళ హీరో సూర్యకు(Surya) పెద్ద ఫ్యాన్‌! తన అభిమాని చనిపోయిందన్న విషయం సూర్యకు తెలిసి భావోద్వేగానికి లోనయ్యాడు. ఐశ్వర్య మృతిపట్ల విచారం వ్యక్తం చేశాడు. ఐశ్వర్య తల్లితండ్రులకు ఓ లేఖ రాశాడు. 'మిమ్మల్న ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదు. ఐశ్యర్య మరణం మనందరికీ తీరని లోటు. ఆమె మన జ్ఞాపకాలలో ఎప్పటికీ బతికే ఉంటుంది' అని లేఖలో పేర్కొన్నాడు సూర్య. 'నువ్వు నిజమైన హీరోవి. నువ్వు చిందించే నవ్వు, ప్రేమను పంచే నీ గుణం, అందరి హృదయాలను తాకుతుంది' అని ఐశ్వర్య గురించి సూర్య రాశాడు.

Updated On 20 May 2023 6:18 AM GMT
Ehatv

Ehatv

Next Story