తమిళ నటుడు శివకుమార్‌(Shiva Kumar) వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సినిమాల్లో అడుగుపెట్టిన సూర్య(suriya) అచిరకాలంలోనే అద్భుతమైన నటుడన్న పేరును సంపాదించుకున్నాడు. స్టార్‌ హీరో అయ్యాడు. టాలీవుడ్‌లోనూ సూర్య సినిమాకు ఉన్న క్రేజ్‌ వేరు. ప్రస్తుతం కంగువా(Kanguva) సినిమాలో నటిస్తున్న సూర్య కొన్ని నెలలుగా ముంబాయిలోనే ఉంటున్నారు.

తమిళ నటుడు శివకుమార్‌(Shiva Kumar) వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సినిమాల్లో అడుగుపెట్టిన సూర్య(suriya) అచిరకాలంలోనే అద్భుతమైన నటుడన్న పేరును సంపాదించుకున్నాడు. స్టార్‌ హీరో అయ్యాడు. టాలీవుడ్‌లోనూ సూర్య సినిమాకు ఉన్న క్రేజ్‌ వేరు. ప్రస్తుతం కంగువా(Kanguva) సినిమాలో నటిస్తున్న సూర్య కొన్ని నెలలుగా ముంబాయిలోనే ఉంటున్నారు. తన భార్య జ్యోతిక(Jyothika), పిల్లలతో కలిసి ముంబాయిలో నివాసం ఉంటున్నారు సూర్య. సూర్య-జ్యోతిక దంపతులకు దియా, దేవ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతంలో చెన్నైను వదిలి పెట్టి సూర్య పూర్తిగా ముంబాయికి మకాం మార్చేశారని కథనాలు వచ్చాయి. వీటిపై సూర్య ఏనాడూ స్పందించలేదు. కానీ లేటెస్ట్‌గా ముంబాయిలో ఓ ఫ్యాన్స్‌ మీట్‌కు హాజరైన సూర్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఆయన ఏమన్నాడంటే తాను ముంబాయిలో ఉండటం లేదని క్లారిటీ ఇస్తూ తన కూతురు, కొడుకు చదువు కోసమే ఇక్కడ ఉంటున్నామని చెప్పాడు. తాను ఇప్పటికీ తమిళనాడులోనే ఉంటున్నానని స్పష్టం చేశాడు సూర్య. ప్రస్తుతానికి జీవితంలో కొత్తది నేర్చుకోవాలనే తాపత్రయంతో ఉన్నానని చెప్పాడు. అందుకే తన సహచరుడు మాధవన్‌తో కలిసి గోల్ఫ్‌ ఆడుతున్నానని తెలిపాడు. మాధవన్(Madhavan), సూర్య మంచి ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే. నటి జ్యోతికను 2006లో సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే కమలహాసన్‌ విక్రమ్‌లోని రోలెక్స్ క్యారెక్టర్ ఆధారంగా ఒక సినిమా కోసం లోకేష్ కనగరాజ్ తనను సంప్రదించారని సూర్య చెప్పిన సంగతి తెలిసిందే!

Updated On 15 Aug 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story