మలయాళ నటి కీర్తి సురేశ్‌(Keerthy Suresh) మహానటి సినిమాతో తెలుగువారికి అత్యంత ఆత్మీయురాలుగా మారారు. సీనియర్‌ నటి మేనక కూతురుగా సినిమాల్లో అడుగుపెట్టిన కీర్తి సురేశ్‌ అనతి కాలంలోనే విజయవంతమైన కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణ భారతంలోని అన్ని భాషలలో నటించి పేరు సంపాదించుకున్నారు. సావిత్రి జీవితకథ ఆధారంగా తీసిన మహానటిలో ఆమె నటనకు విమర్శకులు సైతం అబ్బురపడ్డారు. ఆ సినిమాలో నటనకుగాను ఆమెకు జాతీయ అవార్డు కూడా లభించింది.ఈ మధ్యకాలంలో ఆమె సరైన హిట్‌ అందుకోలేదు.

మలయాళ నటి కీర్తి సురేశ్‌(Keerthy Suresh) మహానటి సినిమాతో తెలుగువారికి అత్యంత ఆత్మీయురాలుగా మారారు. సీనియర్‌ నటి మేనక కూతురుగా సినిమాల్లో అడుగుపెట్టిన కీర్తి సురేశ్‌ అనతి కాలంలోనే విజయవంతమైన కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణ భారతంలోని అన్ని భాషలలో నటించి పేరు సంపాదించుకున్నారు. సావిత్రి జీవితకథ ఆధారంగా తీసిన మహానటిలో ఆమె నటనకు విమర్శకులు సైతం అబ్బురపడ్డారు. ఆ సినిమాలో నటనకుగాను ఆమెకు జాతీయ అవార్డు కూడా లభించింది.ఈ మధ్యకాలంలో ఆమె సరైన హిట్‌ అందుకోలేదు. కాకపోతే ఆమె తరచూ వార్తల్లో వ్యక్తి అవుతున్నారు. అందుకు కారణం ఆమె పెళ్లిపై మరోసారి వదంతులు రావడం. ఆ వదంతుల్లో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేశ్‌ పదే పదే చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌తో(Anirudh Ravichander) కలిసి ఉన్నట్టు రూమర్లు వస్తున్నాయి. ఈ వదంతులపై ఈసారి కీర్తి సురేశ్‌ తండ్రి సురేశ్ కుమార్‌(Suresh Kumr) స్పందించాల్సి వచ్చింది. కీర్తి- అనిరుధ్‌ పెళ్లి విషయంపై వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. ఆ ప్రచారాలు అన్నీ నిరాధారమైనవని, వాటిలో ఏమాత్రం కూడా వాస్తవం లేదని చెప్పారు. 'కీర్తి గురించి ఇలాంఇ వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఇలాంటివి చాలానే ఉన్నాయి. తాజాగా కీర్తి, అనిరుధ్‌ గురించి ఎవరో కావాలనే ఓ వార్తను సృష్టించి ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు' అని ఆయన అన్నారు. ఇదే సమయంలో కీర్తి సురేశ్‌ కూడా అనిరుధ్‌తో పెళ్లి వార్తలను ఖండించారు. టైమ్స్‌ నౌతో ఆమె మాట్లాడుతూ 'ఇది తప్పుడు వార్త. అనిరుధ్‌ నాకు మంచి స్నేహితుడు. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు' అని చెప్పారు. అయితే కీర్తి సురేశ్‌, అనిరుధ్‌ రవిచందర్‌ పెళ్లిపై వదంతులు రావడం ఇదే మొదటిసారి కాదు. శివకార్తికేయ నటించిన రెమో, సూర్య నటించిన గ్యాంగ్‌, పవన్‌ నటించిన అజ్ఞాతవాసి వంటి మరెన్నో సినిమాల కోసం కీర్తి సురేశ్‌, అనిరుధ్‌ కలిసి పని చేశారు. వీరిద్దరూ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని చెబతారు. ఇటీవల జవాన్‌లోని అనిరుధ్‌ బ్లాక్‌ బస్టర్‌ పాట చలేయా పాటకు డైరెక్టర్‌ అట్లీ భార్య కృష్ణ ప్రియతో కలిసి డాన్స్‌ కూడా చేశారు కీర్తి. ఇది కూడా సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది.

Updated On 17 Sep 2023 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story