టాలీవుడ్(Tollywood) లో అతి పెద్ద సినిమా ఫ్యామిలీ దగ్గుబాటి ప్యామిలీ(Daggubati Family). ఈ ఫ్యామిలీలో హీరోలు,ప్రొడ్యూసర్లు,దర్శకులు, అందరూఉన్నారు. ఇక ఈ ఫ్యామిలీలో పెళ్లి(Marriage) బాజాలు మోగబోతున్నాయి. అదికూడా ఇక్కడ కాదు శ్రీలంకలో(Srilanka).. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు(Daggubati Suresh babu) చిన్న కుమారుడు హీరో రానా(Rana) దగ్గుబాటి తమ్ముడైన అభిరామ్ దగ్గుబాటి(Abhiram) పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు రుగుతున్నాయి. ఈ డిసెంబర్‌లో వీరి వివాహం జరగబోతోంది. . కాగా అందుతున్న లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారాన్ని బట్టి డిసెంబర్ 6న రాత్రి 8 గం.ల 50 ని. లకు శ్రీలంకలోఫైవ్ స్టార్ రిసార్ట్ అయిన అనంతర కలుతారాలో ప్రత్యూష చపరాల తో అభిరామ్ వివాహం గ్రాండ్ గా జరుగనుంది.

దాదాపు 200 మంది బందుమిత్రులు, సెలబ్రిటీలు ఈ పెళ్లిలో సందడి చేయబోతున్నారు. వివాహ వేడుకకి విచ్చేయనున్నారు. అయితే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు అతిథులు సోమవారం శ్రీలంకలో అడుగుపెట్టనున్నారు. కాగా మూడు రోజుల వివాహ వేడుకలు సోమవారం రాత్ర 8:30 గంటలకు గ్రాండ్ డిన్నర్ పార్టీతో(Dinner Party) ప్రారంభమవుతాయి. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు మెహందీ వేడుక, అనంతరం విందు ఏర్పాటు చేస్తారు.

ఇక బుధవారం ఉదయం 10:30 గంటలకు పెళ్లికూతురు వేడుక నిర్వహించి అనంతరం సాయంత్రం 7 గంటలకు వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. కాగా రాత్రి 8:50 గంటలకు సుముహూర్తం. వివాహం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన దగ్గుబాటి ఫ్యామిలీ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సినీ, వ్యాపార, రాజకీయ వర్గాల వారు, అభిమానులు హాజరవుతారు.

Updated On 3 Dec 2023 2:33 AM GMT
Ehatv

Ehatv

Next Story