యూఎస్‏లో ఇప్పటికే 'విరూపాక్ష' షోలు పడిపోయాయి. ఫస్ట్ షో చూసిన అక్కడి వాళ్లందరూ ట్విటర్ ద్వారా వాళ్ల అభిప్రాయాలు తెలుపుతున్నారు. సినిమా చాలా బాగుందని.. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇదొకటి అని యూఎస్ (US) ఆడియన్స్ 'విరూపాక్ష' (Virupaksha) సినిమాపై ప్రశంసలు కూరిపిస్తున్నారు. సాయి తేజ్ బొమ్మ చూపించాడంటున్నారు.

డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంపౌండ్ నుంచి వచ్చిన డైరెక్టర్లెవరూ రీసెంట్ టైమ్స్ లో నిరాశపరచలేదు. ఉప్పెన చిత్రంతో సెన్సేషనల్ బుచ్చిబాబు (Bucchibabu Sana) హిట్ కొడితే.. మొన్న దసరాతో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఊరమాస్ హిట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన శిష్యుడిగా వచ్చిన కార్తీక్ దండు కూడా మాంచి హారర్ థ్రిల్లర్ ఆడియన్స్‏ను ఎంటర్ టైన్ చేశాడని టాక్ విపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ' విరూపాక్ష చిత్రంతో కార్తీక్ దండు (Karthik Dandu) డైరెక్టర్‏గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్‏పీ, సుకుమార్ బ్యానరర్లపై ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) రోడ్డు ప్రమాదం తర్వాత ఈ సినిమా రావడంతో 'విరూపాక్ష' చిత్రంపై ఆడియన్స్‏కి ఇంట్రెస్ట్ ఏర్పడింది. రెండేళ్ల తర్వాత సాయి ధరమ్ తేజ్ సినిమా వస్తుండటంతో.. అందులోనూ ఇప్పటికే ట్రైలర్ తోపాటు సినిమాపై ఆడియన్స్‏లో హైప్ క్రియేట్ అయింది. అయితే ఇవాళ రిలీజ్ అయిన సినిమాపై అభిమానులు సాయి తేజ్‏కు హిట్ పడిందని అంటున్నారు.

యూఎస్‏లో ఇప్పటికే 'విరూపాక్ష' షోలు పడిపోయాయి. ఫస్ట్ షో చూసిన అక్కడి వాళ్లందరూ ట్విటర్ ద్వారా వాళ్ల అభిప్రాయాలు తెలుపుతున్నారు. సినిమా చాలా బాగుందని.. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇదొకటి అని యూఎస్ (US) ఆడియన్స్ 'విరూపాక్ష' (Virupaksha) సినిమాపై ప్రశంసలు కూరిపిస్తున్నారు. సాయి తేజ్ బొమ్మ చూపించాడంటున్నారు. ఇటు మెగా అభిమానులు కూడా యూఎస్ ఆడియన్స్ రివ్యూలను పాజిటివ్‏గా తీసుకుంటున్నారు. సినిమాలో బీజీఎం (BGM) అండ్ అలాగే సినిమాటోగ్రఫీ (Cinematography) కూడా చాలా బాగుందని.. సినిమా అంతా ఎంగేజింగ్ ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మరో నెటిజన్ అయితే సినిమా ఎక్సెలెంట్ అని.. మ్యూజిక్ బావుందని.. ఆర్టిస్టుల పర్ఫామెన్సెస్ కూడా బావున్నాయని ట్విట్ చేశాడు. ఇంకొకరు 'విరూపాక్ష' (Virupaksha) చిత్రం 2023లో వచ్చిన మరో చంద్రముఖి అంటూ.. కంగ్రాట్స్ సాయి ధరమ్ తేజ్ అన్నా అంటూ ట్వీట్ చేశాడు. ఇక మరో నెటిజన్ అయితే ఫస్ట్ హాఫ్: 'హోల్డ్ యువర్ బ్రీత్' సెకండ్ హాఫ్: హోల్డ్ యువర్ గులాబ్ జామ్స్ అని సినిమా హిట్టు అని చెప్పి 3.5 రేటింగ్ కూడా ఇచ్చేశాడు.

ఇలా చాలా మంది 'విరూపాక్ష' ఫస్టాఫ్ అదిరిపోయిందని.. హీరో లుక్స్ కూడా చాలా ఫ్రెష్‏గా ఉన్నాయని.. డైరెక్టర్ కార్తీక్ దండు (Karthik Dandu) చిత్రాన్ని ఎక్సలెంట్‏గా హ్యాండిల్ చేశాడని పొగుడుతున్నారు. డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్ ఆడియన్స్‏ను అలా కూర్చోబెడుతుందంటున్నారు. ఇక సుకుమార్ స్క్రీన్ ప్లే ఆడియన్స్‏ను సీటు ఎడ్జ్ మీద కూర్చోబెడుతుందంటున్నారు. మరికొంతమంది ఆడియన్స్ ఫస్టాఫ్ ఉన్నంతగా సెకండ్ హాఫ్ లేదని.. లవ్ ట్రాక్ కాస్త బోరింగ్ గా ఉందని చెబుతున్నారు. లవ్ స్టోరీలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సేమ్ ప్లాట్ లో మూవీని నడిపించి ఉంటే సినిమా ఇంకాస్త బావుండేదంటున్నారు. ఓవరాల్ రెండేళ్ల తర్వాత వచ్చిన సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్‏(Sai Dharam Tej)కు మాంచి బ్లాక్ బస్టర్ హిట్ పడిందనే చెప్పాలి.

Updated On 21 April 2023 12:27 AM GMT
Ehatv

Ehatv

Next Story