విచిత్ర సోదరులు సినిమాలో కమలహాసన్‌తో(Kamal Hassan) కలిసి నటించిన మోహన్(Mohan) అనే సహాయనటుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. తమిళనాడులోని మదురై(Madhurai) జిల్లా తిరుప్పాంగుండ్రం పెరియరథం వీధి సమీపంలోని వెళ్లింగిండ్రు దగ్గర ఓ మృతదేహం పడి ఉన్నట్టు మంగళవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది.

Supporting Actor Mohan Death
విచిత్ర సోదరులు(Vichitra Sodharuli) సినిమాలో కమలహాసన్‌తో(Kamal Hassan) కలిసి నటించిన మోహన్(Mohan) అనే సహాయనటుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. తమిళనాడులోని మదురై(Madhurai) జిల్లా తిరుప్పాంగుండ్రం పెరియరథం వీధి సమీపంలోని వెళ్లింగిండ్రు దగ్గర ఓ మృతదేహం పడి ఉన్నట్టు మంగళవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని మదురై ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల విచారణలో ఆ మృతదేహం సేలం జిల్లా మేటూరు గ్రామానికి చెందిన సహాయ నటుడు మోహన్‌ది అని తెలిసింది. 55 ఏళ్ల మోహన్ పలు చిత్రాలలో నటించాడు.
నాన్ కడవుల్(Nan Kadavul), అదిశయ మనిదర్‌గళ్(Adisha Manidargal) సినిమాలు ఆయనకు పేరు తెచ్చాయి. సేలంకు చెందిన మోహన్ మదురైకు ఎందుకు వెళ్లాడో ఎవరికీ తెలియదు. ఆయన ఎలా మరణించాడన్న విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. సినిమా అవకాశాల కోసం మోహన్ మదురై వచ్చాడని కొందరు అంటున్నారు. ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాలేదని చెబుతున్నారు. పొట్ట నింపుకోవడం కోసం కొన్నాళ్లుగా బిక్షాటన చేసుకుంటున్నాడని అన్నారు. పేదరికం, అనారోగ్య సమస్యల కారణంగానే మోహన్ చనిపోయాడని చెబుతున్నారు. సినిమా అవకాశాల కోసం చెన్నైకి కాకుండా మదురైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో మాత్రం తెలియడం లేదు. ఈ విషయాలపై క్లారిటీ వస్తే కానీ మోహన్ మరణానికి కారణం తెలియదు.
