సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ (Rajinikanth) నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో న‌టించిన‌ సినిమా ‘జైలర్'(Jailer).తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కన్నడ న‌టుడు శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) తో పాటు.. శివగామి.. రమ్య కృష్ణ కూడా కీలక పాత్రల్లో కనిపించి మురిపించారు.

ఎప్పుడెప్పుడా అనిఫ్యాన్స్ ఎదురు చూసిన తలైవా జైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఈమూవీ పాజిటీవుటాక్ తో దూసుకుపోతోంది. ఈక్రమంలో ఈమూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసుకున్నారట.. ? ఇంతకీ ఏందులో స్ట్రీమింగ్ అవ్వబోతోందంటే...?

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ (Rajinikanth) నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో న‌టించిన‌ సినిమా ‘జైలర్'(Jailer).తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కన్నడ న‌టుడు శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) తో పాటు.. శివగామి.. రమ్య కృష్ణ కూడా కీలక పాత్రల్లో కనిపించి మురిపించారు. ఈమూవీ నిన్న (ఆగ‌స్టు 10) ప్రపం వ్యాప్తంగా ఆడియన్స్ మందుకు వచ్చి.. సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది.

వింటేజ్ ర‌జనీకాంత్ క‌నిపించాడ‌ని సినిమా చూసిన వారు చెబుతుండ‌గా.. ర‌జనీ ఈజ్ బ్యాక్ అంటూ అత‌డి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొద‌టి రోజే ఈ చిత్రం రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ జనాలు అంచ‌నా వేస్తున్నారు. ఇక ఈక్రమంలో జైలర్ మ్యానియా థియేటర్లలో నడుస్తుండగానే... ఈమూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ రన్ అవుతోంది. ఇంతకీ ఈమూవీ ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది..? ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోంది చూస్తే..?

ఇక ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను స‌న్‌నెక్ట్స్‌ ద‌క్కించుకుంది. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ దాదాపు 200కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించ‌గా త‌మ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన స‌న్‌నెక్ట్స్ ద్వారానే రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. థియేట‌ర్‌లో విడుద‌లైన ఆరు వారాల త‌రువాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్క‌న సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించబోతున్నట్టు తెలుస్తోంది.

Updated On 11 Aug 2023 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story