ఈమధ్య తమ అభిమాన తారలపై అభిమానం హద్దులు మీరుతోంది. తాముప్రాణంగాప్రేమించే హీరోల సినిమాలు ఆదరించడంలో తప్పులేదు. ఎన్నిసార్లు చూసినా...అది అభినం అంటారు.. అన్నదానాలు, సహాయకార్యక్రమాలుచేయడంలో తప్పులేదు. కాని...అది కాస్త వెర్రిగా మారి..బ్రతికి ఉన్న స్టార్స్ కు గుడి కట్టడం..దేవుడికిచేయాల్సిన పూజలు ఆహీరోకు చేయడం అంటేనే.. కాస్త ఓవర్ అవుతుంది.

ఈమధ్య తమ అభిమాన తారలపై అభిమానం హద్దులు మీరుతోంది. తాముప్రాణంగాప్రేమించే హీరోల సినిమాలు ఆదరించడంలో తప్పులేదు. ఎన్నిసార్లు చూసినా...అది అభినం అంటారు.. అన్నదానాలు, సహాయకార్యక్రమాలుచేయడంలో తప్పులేదు. కాని...అది కాస్త వెర్రిగా మారి..బ్రతికి ఉన్న స్టార్స్ కు గుడి కట్టడం..దేవుడికిచేయాల్సిన పూజలు ఆహీరోకు చేయడం అంటేనే.. కాస్త ఓవర్ అవుతుంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) అభిమాని ఓకరు ఆయనకు గుడి కట్టాడు..అంతటితో ఆగకుండా.. దేవుడికిచేయాల్సిన పూజలన్నీ చేసేస్తున్నాడు. అభిషేకాలు అర్చనలతో హడావిడి చేస్తున్నారు.

అభిమానం ఉండొచ్చు కాని అది హద్దులు మీరితే ఇలాంటి పైత్యాలే బయటకు వస్తాయి. గతంలో కూడా తమిళనాట ఇలాంటివి జరిగాయి. రజినీకాంత్ తో పాటు.. కుష్బూ, నయనతార, సమంతలకు, అటు ఉత్తరాదిన సచిన్, సోనూసూద్ లకు గుడి కట్టి తమ అభిమానాన్ని అతిగా చూపించుకన్నారు.. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు కూడా గుడికట్టడంతో పాటు.. .. నిత్యపూజలు, హారతులు..అభిషేకాలు కూడా చేస్తున్నారు.

మధురైకి(Madurai) చెందిన కార్తీక్(Karthik) అనే రజనీకాంత్ వీరాభిమాని ఆయన కోసం గుడి కట్టాడు. ఆ గుడిలో 250 కిలోల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు. విగ్రహం క్రింద తన తల్లిదండ్రుల ఫోటో, గణేశుని ఫోటో ఉంచాడు. ఇక ప్రతి రోజు రజనీకాంత్ విగ్రహానికి హారతులు, అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నాడు. రజనీకాంత్‌ను దేవుడిగా.. తానో భక్తుడిగా మారిపోయాడు కార్తీక్. ఈ అభిమాని గురించి రజనీకాంత్ వరకు చేరిందో లేదో తెలియదు కానీ ఇతని గుడి, పూజలు మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Updated On 28 Oct 2023 4:15 AM GMT
Ehatv

Ehatv

Next Story