జైలర్ ను మించి జైలర్ 2 సినిమాను చూపించబోతున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.

జైలర్ ను మించి జైలర్ 2 సినిమాను చూపించబోతున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar). జైలర్ సినిమాలో యాక్షన్ డోస్ ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచింది. ఇక జైలర్ 2 లో అంతకు మించిన యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు రజినీకాంత్(Rajini Kanth). సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’. ఈసినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించిందో అందరికి తెలిసిందే.

ఈసినిమా రజినీకాంత్ కెరీర్ లోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో కలిపి దాదాపు 700 కోట్లు కలెక్ట్ చేసి అద్భుత విజయాన్ని సాధించింది. ఇక ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీకు సీక్వెల్ గా ‘జైలర్‌ 2’ (Jailer 2)రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈమూవీ అనౌన్స్ చేయడం.. షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అంతే కాదు తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సీక్వెల్ షూటింగ్ పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. మార్చి రెండో వారంలో సూపర్ స్టార్ కు సబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నాట.

అంతే కాదు ఫస్ట్ పార్ట్ మూవీ కంటే కూడా ఈసినిమా లో యాక్షన్ ట్రీట్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు. జైలర్ సినిమా లోకంటే ‘జైలర్‌ 2’లో రజనీకాంత్ ను ఇంకాస్త స్టైలిష్‌గా చూపించనున్నారని, అలాగే రజని లుక్ విషయంలో కూడా నెల్సన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక జైలర్ 2’లో నటసింహం బాలయ్య బాబు(Bala krishna) నటిస్తారన్న టాక్ ఉంది. మరి అంది ఎంత వరకూ నిజమో అఫీషియల్ అనౌన్స్ మెంట్ తరువాతే తెలుస్తుంది. ఇక ఈసారి కూడా తమన్నా(Tamanna), యోగిబాబు(Yogibabu), వినాయకన్(Vinayakan), రమ్యకృష్ణ(Ramyakrishna) తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2 ను భారీబడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇక రజనీకాంత్‌ ప్రస్తుతం జైలర్ 2 తో పాటు ‘కూలీ’(Kuli) సినిమా కూడా చేస్తున్నారు. ఈరకంగా సూపర్ స్టార్ ఈ ఏడాదంతా బిజీబిజీగా ఉండబోతున్నారు. జైలర్‌’లో టైగర్‌ కా హుకూమ్‌ అంటూ ‘ హంగామా చేసిన రజనీకాంత్‌.. జైలర్ 2లో ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి.

ehatv

ehatv

Next Story