సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) సినిమా జైలర్‌(Jailer) ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. పక్కా మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా అని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. మొన్ననే చెన్నైలో ఈ సినిమా ఆడియో రిలీజ్‌(audio Launch) వేడుక జరిగింది. ఇప్పుడా ఫంక్షన్‌ ప్రస్తావన ఎందుకంటే, అందులో రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మొరగని కుక్కా లేదు, విమర్శించని నోరూ లేదు, ఈ రెండూ లేని ఊరు లేదు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) సినిమా జైలర్‌(Jailer) ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. పక్కా మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా అని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. మొన్ననే చెన్నైలో ఈ సినిమా ఆడియో రిలీజ్‌(audio Launch) వేడుక జరిగింది. ఇప్పుడా ఫంక్షన్‌ ప్రస్తావన ఎందుకంటే, అందులో రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మొరగని కుక్కా లేదు, విమర్శించని నోరూ లేదు, ఈ రెండూ లేని ఊరు లేదు. ఎవరేం చెప్పినా మన పని చేసుకుంఊ పోవాలి. అర్థమైందా రాజా అంటూ రజనీకాంత్‌ తన స్టయిల్‌లో అన్నారు. ఈ మాటలు ఎందుకన్నట్టు అని చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు. మొన్నామధ్య ఏపీకి వచ్చినప్పుడు చంద్రబాబును(Chandra Babu) పొగిడేశారు కదా! దాంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) వారికి కాలింది. సోషల్‌ మీడియాలో రజనీని కడిగిపారేశారు వైసీపీ వాళ్లు. ఓ రేంజ్‌లో ఆటాడేసుకున్నారు. ఇదంతా చూసి రజనీకి కూడా కోపం వచ్చేసి ఉంటుంది. మరి వైసీపీ వాళ్లకు కౌంటర్‌ ఇవ్వాలిగా అందుకే ఈ డైలాగ్‌ చెప్పి ఉంటారు అని టీడీపీ(TDP) వాళ్లతో పాటు తటస్థులు కూడా అంటున్నారు.

అన్నట్టు ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న రమ్యకృష్ణ(Ramyakrishna) కూడా అర్థమైందా రాజా అన్నప్పుడు నోటికి చేయి అడ్డుపెట్టుకుని మరీ నవ్వేసింది. ఆమెకు ఏం అర్థమయ్యిందో ఏమో! సరే ఇప్పుడు రజనీ అన్న మాటలకు వైసీపీ కౌంటర్‌ ఇస్తుందా లేక మనల్ని కాదులే అనుకుంటుందా? ఇందుకో కారణం ఉంది. రజనీ ఏ సందర్భంలో ఈ మాటలన్నాడో ఆడియో ఫంక్షన్‌ చూసిన వారికి తెలుస్తుంది. ఆయన పూర్తిగా ఏమన్నాడంటే.. ఒకప్పుడు నాకు సూపర్‌స్టార్‌ బిరుదు ఇస్తుంటే నిరాకరించాను. వెంటనే అందరూ నేను వెనకడుగు వేశానన్నారు. శివాజీ గణేశన్‌(Shivaji ganeshan), కమలహాసన్‌(Kamal Hassan) వంటి వాళ్లు ఉండగా నాకెందుకు ఆ సూపర్‌స్టార్‌ అనుకున్నాను. ఇప్పుడు కూడా అలాంటి సమస్యే వస్తోంది. కానీ నేను వాటి గురించి పట్టించుకోను అని అంటూ మెరకగని కుక్క లేదు అని కొనసాగించారు రజనీకాంత్‌. మొన్నామధ్య దళపతి విజయ్‌ అభిమానులు(Vijay Thalapthy Fans) రజనీతో పెట్టుకున్నారు. భవిష్యత్తు సూపర్‌స్టార్‌ విజయ్‌ అని రజనీకాంత్‌ సూపర్‌స్టార్‌ హోదా నుంచి తప్పుకుంటే బెటర్‌ అని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. పాపం ఇది కూడా రజనీకాంత్‌ను హర్ట్‌ చేసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్‌ ఇలా మాట్లాడి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి రజనీ వ్యాఖ్యలను వైసీపీ వాళ్లు లైట్‌ తీసుకుంటున్నారు.

Updated On 10 Aug 2023 7:59 AM GMT
Ehatv

Ehatv

Next Story