గోల్డెన్ వీసాను అందుకున్న సరికొత్త భారతీయ సెలబ్రిటీగా

గోల్డెన్ వీసాను అందుకున్న సరికొత్త భారతీయ సెలబ్రిటీగా రజనీకాంత్ నించారు. సూపర్ స్టార్ UAE సంస్కృతి, పర్యాటక శాఖ నుండి గోల్డెన్ వీసా పొందారు. UAE గోల్డెన్ వీసాతో దీర్ఘకాల నివాసం, అక్కడ పని చేయడానికి అనుమతిస్తుంది. భారతదేశంలోని పలువురు ప్రముఖులు, సినీ నటులు ఇటీవల యూఏఈ నుంచి గోల్డెన్ వీసాలు అందుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి రజనీకాంత్‌ చేరారు.

వీసాను అందించినందుకు UAE ప్రభుత్వానికి, అతని స్నేహితుడు, లులు గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ MA యూసఫ్ అలీకి సూపర్ స్టార్ రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో, రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ” సినిమా ప్రారంభించనున్నారు

Updated On 24 May 2024 2:48 AM GMT
Yagnik

Yagnik

Next Story