విజయ్‌ని చిన్నప్పటి నుంచి చూశానని.. తన కఠోర శ్రమతో పెద్ద స్టార్‌గా
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కొన్ని రోజుల క్రితం జరిగింది. ఆడియో లాంచ్‌లో ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. తన మాటలను వేరే అర్థంలో తీసుకోవద్దని అభిమానులను, ప్రేక్షకులను కోరారు. “నేను కాకి, డేగ కథను సాధారణంగా చెప్పాను. సోషల్ మీడియాలో, నేను విజయ్‌ని సూచించినట్లుగా వ్యాపించింది. నేను నిజంగా అలా ఉద్దేశించలేదు, ” అని రజనీ జైలర్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు. విజయ్‌ని చిన్నప్పటి నుంచి చూశానని.. తన కఠోర శ్రమతో పెద్ద స్టార్‌గా ఎదిగాడని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. ఇక రజనీకాంత్‌ను సంఘీ అని ప్రజలు అభివర్ణించడంపై ఐశ్వర్య రజనీకాంత్ స్పందించారు. రజనీకాంత్ సంఘీ కాదని.. ఆయన సంఘీ అయితే లాల్ సలామ్ సినిమాని అంగీకరించడని ఆమె భావోద్వేగంతో చెప్పారు. అదే సమయంలో రజనీ కూడా కన్నీళ్లు పెట్టడం చూడవచ్చు. రజనీకాంత్ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారని గత కొన్నేళ్ళుగా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. తమిళనాడు ప్రజలు కూడా రజనీకాంత్ బీజేపీకి దగ్గరవడ్డాన్ని తప్పుబట్టారు. అలాంటి విషయాలపై క్లారిటీ ఇవ్వడానికి లాల్ సలామ్ ఆడియో లాంచ్ ఈవెంట్ వేదికగా మారింది.
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.