✕
Rajinikanth In Sr.NTR Celebrations : ఎన్టీఆర్ పట్ల ఆరాధనకి నిదర్శనంగా....తమిళ్ సూపర్ స్టార్ రజనీ ఆగమనం
By EhatvPublished on 28 April 2023 5:10 AM GMT
ఎప్పుడో 1979లో టైగర్ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలసి నటించిన అనుబంధం. ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్న ఆదర్శం. తన ఇంట్లో నేరుగా ఎన్టీఆర్ చిత్రపటాన్ని తన డ్రాయింగ్ రూంలోనే పెట్టుకున్నంత ఆరాధన...ఇవన్నీ ఎన్టీఆర్‌కీ, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మధ్యలో ఉన్న అనుబంధానికి కొన్ని మచ్చుతునకలు.

x
rajini kanth
-
- ఎప్పుడో 1979లో టైగర్ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలసి నటించిన అనుబంధం. ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్న ఆదర్శం. తన ఇంట్లో నేరుగా ఎన్టీఆర్ చిత్రపటాన్ని తన డ్రాయింగ్ రూంలోనే పెట్టుకున్నంత ఆరాధన...ఇవన్నీ ఎన్టీఆర్‌కీ, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మధ్యలో ఉన్న అనుబంధానికి కొన్ని మచ్చుతునకలు. కానీ ఎన్టీఆర్ అడుగుజాడలలోనే రజనీకాంత్ నడిచారని, ఆయన నుంచి ఆదర్శంగా తీసుకున్న జీవితపాఠాలనే అనుదినం ఆచరణలో పెట్టుకుని ఎదిగారని, ఎదిగాక కూడా ఎన్టీఆర్ పట్ల ఉన్న ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలను, ఆరాధనా భావాన్ని ఎక్కడా ఏ క్షణంలోనూ జారవిడుచుకోని గొప్ప సహృదయం వెరసి రజనీకాంత్ అంటే అక్షరాల నిజం అది.
-
- నిజానికి తొలిసారి ఎన్టీఆర్‌తో రజనీకాంత్ నటించిన టైగర్ టైంకి రజనీకాంత్ ఇంకా డబ్బింగ్ యాక్టర్. ఎన్టీఆర్ ఎక్కడో తారాపథంలో విహరిస్తున్న దశ. కానీ, షూటింగ్ టైంలో ఎన్టీఆర్ ఏ విధంగా నడుచుకునేవారు, ఏ రీతిలో నిర్మాతలను, సాంకేతిక నిపుణులను ఆదరించి, గౌరవించేవారు అనే విషయాలను రజనీకాంత్ క్షుణ్ణంగా వంట పట్టించుకున్నారు, ఎన్టీఆర్‌కి ఎంజిఆర్ పెట్టిన పేరు తిలుంగు సింగం(తెలుగు సింహం). ఈ పేరుతోనే రజనీకాంత్ కూడా ఎన్టీఆర్‌ని సంబోదించే అలవాటును చేసుకున్నారు.
-
- తెలుగు సినిమా గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో కూడా రజనీకాంత్ మాట్లాడుతూ, ఇంత వైభవంగా జరుగుతున్న ఈ ఉత్పవాలలో తెలుగు సింగం ఎన్టీఆర్ లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని గుర్తు చేసుకున్నారు. అందుకే పిలవగానే, ఏ మాత్రం భేషజాలకు, ఆరమరికలకు తావు లేకుండా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా రుజనీకాంత్ వచ్చారు. 2023 సంవత్సరం, మే 28న జరగబోతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను అప్పుడే ఏడాదిగా నిర్వహిస్తున్న టిడిపి గుంటూరు శివారు ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని జరుపబోతూ రజనీకాంత్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
-
- రజనీకాంత్ కూడా ఎన్టీఆర్ పట్ల మమకారంతో ఈ రోజున విజయవాడ చేరుకున్నారు. ఆయనని యువరత్న బాలకృష్ణ సాదరంగా, ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి రజనీకాంత్ నేరుగా హోటల్‌కి చేరుకుని, మధ్యాహ్నం మూడు గంటలకు బాలకృష్ణతో కలసి ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి తేనేటి విందుకు వెళ్తారు. అక్కడ నుంచి అందరూ కలసి విజయవాడలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేదికకు చేరుకుంటారు. దక్షిణాది బాషలలో అత్యంత కీర్తిప్రతిష్టలు కలిగిన రజనీకాంత్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం వేడుకలకు ఎంతో నిండుదనాన్ని ఆపాదించిందని అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Ehatv
Next Story