తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం లియో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో దళపతి విజయ్‌ హీరోగా నటిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్‌ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు లోకేశ్‌ కనగరాజ్‌. లియో సినిమా పూర్తయిన తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఓ సినిమా చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నటుడు బాబు ఆంటోనీ క్లారిటీ ఇచ్చారు. లియో సినిమాలో ఈయన కీలకపాత్ర పోషించారు.

తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం లియో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో దళపతి విజయ్‌ హీరోగా నటిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్‌ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు లోకేశ్‌ కనగరాజ్‌. లియో సినిమా పూర్తయిన తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఓ సినిమా చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నటుడు బాబు ఆంటోనీ క్లారిటీ ఇచ్చారు. లియో సినిమాలో ఈయన కీలకపాత్ర పోషించారు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆంటోనీ పలు విషయాలను పంచుకున్నారు. రజనీకాంత్‌- లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో సినిమా కచ్చితంగా ఉంటుందని అన్నారు. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయన్నారు. కథలు వేరైనా ఒక సినిమాలోని పాత్రలను మరో సినిమాతో లింక్‌ చేస్తూ సినిమాటిక్‌ యూనివర్స్‌ను క్రియేట్‌ చేసిన లోకేశ్‌ .. రజనీకాంత్‌తో చేయబోయే సినిమాను అందులో భాగం చేస్తారో లేదో తెలియదు. దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న లియో చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 19న దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మాస్టర్‌ సినిమా తర్వాత లోకేశ్‌- విజయ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం, కమలహాసన్‌ విక్రమ్‌ తర్వాత లోకేశ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో లియోపై ఎక్కడలేని ఆసక్తి పెరిగింది. ఇక రజనీకాంత్‌ విషయానికి వస్తే ఇటీవలే లాల్‌సలామ్‌ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు రజనీకాంత్‌. ఐశ్వర్య రజనీకాంత్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విష్ణు విశాల్‌ ఇందులో హీరో.. రజనీకాంత్‌ది కీలక పాత్ర.
మరోవైపు, రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన జైలర్‌ ఆగస్టు 10న విడుదల కానుంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated On 18 July 2023 6:45 AM GMT
Ehatv

Ehatv

Next Story