తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‎రెడ్డికి సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షుల తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన మహేష్ బాబు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి అనుముల గారికి నా శుభాకాంక్షలు. మీ పాలనలో రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, అభివృద్ధి, సంక్షేమంలో ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను.

తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‎రెడ్డికి సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షుల తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన మహేష్ బాబు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి అనుముల గారికి నా శుభాకాంక్షలు. మీ పాలనలో రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, అభివృద్ధి, సంక్షేమంలో ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మహేష్‎బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ పార్టీల నుంచే కాకుండా టాలీవుడ్‌ నుంచి కూడా అభినందనలు వెల్లువెత్హుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్, ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నూతన సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో మరో స్టార్ హీరో అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.

ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 7 తెలంగాణా రాష్ట్ర రెండో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు రేవంత్‎రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Updated On 8 Dec 2023 7:14 AM GMT
Ehatv

Ehatv

Next Story