మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) సినిమాల్లో ఒకటి రెండు మినహా అన్నీ ఘన విజయం సాధించాయి. అగ్రహీరోలు ఆయన దర్శకత్వంలో నటించడానికి ఉబలాటపడుతారు. ప్రస్తుతం మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ గుంటూరు కారం(Gunturu Karam) అనే సినిమా చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా గందరగోళంలో ఉన్నారని అభిమానులు అంటున్నారు. అలా ఎలా అనగలిగారన్న డౌటు రావచ్చు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) సినిమాల్లో ఒకటి రెండు మినహా అన్నీ ఘన విజయం సాధించాయి. అగ్రహీరోలు ఆయన దర్శకత్వంలో నటించడానికి ఉబలాటపడుతారు. ప్రస్తుతం మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ గుంటూరు కారం(Gunturu Karam) అనే సినిమా చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా గందరగోళంలో ఉన్నారని అభిమానులు అంటున్నారు. అలా ఎలా అనగలిగారన్న డౌటు రావచ్చు. ఇందుకు వారు చెబుతున్నదేమిటంటే ఇప్పుడు త్రివిక్రమ్ చేస్తున్న పనులు అలాగే ఉన్నాయట! ఆయన ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా అనౌన్స్ చేయడం ఎప్పుడూ చేయలేదు. ఒకటి రెండు సార్లు తర్వాత సినిమా ఫలానా హీరోతో చేస్తాడేమో అన్న ఊహాగానాలు తప్పించి ఆయన అధికారికంగా సినిమాలను ప్రకటించిన సందర్భాలు అసలు లేవు. అలాంటిది ఇప్పుడు గుంటూరుకారం సినిమా మొదలు పెట్టిన తర్వాత ఎన్ని చిత్రాలు జరగాలో అన్నీ జరుగుతున్నాయి. మహేశ్ బాబు లాంటి టాప్ హీరోతో సినిమా చేస్తూ మరో హీరోతో పాన్ ఇండియా సినిమాను ప్రకటించడం వెనుక అసలు మతలబు ఏమిటని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ గుంటూరు కారం సినిమా ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా మొదలు పెట్టి ఏడాది గడిచింది. ఇప్పటికీ కనీసం సగం కూడా కాలేదు. కచ్చితంగా చెప్పాలంటే 40 శాతం మాత్రమే షూటింగ్‌ను జరుపుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది రెండు షెడ్యూల్స్ చేసిన తర్వాత దాన్నంతా తీసి పక్కన పెట్టేసి మళ్లీ ఈ ఏడాది కొత్తగా మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది కూడా మహేశ్‌బాబు నచ్చడం లేదన్న ప్రచారం జరుగుతోంది. కథ విషయంలో త్రివిక్రమ్ మరోసారి నేరేషన్ అడిగినట్టు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ విషయంలోనే ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. లేటెస్ట్‌గా అల్లు అర్జున్(Allu Arjun) సినిమాను అనౌన్స్ చేసి త్రివిక్రమ్ అభిమానుల మనసు గాయపరిచారు. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సినిమా ప్రకటించవచ్చు కదా, ఇలా మధ్యలోనే ప్రకటించడం వెనుక త్రివిక్రమ్ ఉద్దేశం ఏమిటి? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమ హీరోను అవమానిస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా గుంటూరు కారం సినిమా సంక్రాంతికి కచ్చితంగా వస్తుందని త్రివిక్రమ్ అంటున్నారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే సంక్రాంతికి రావడం అనుమానమేనని అనిపిస్తోంది.