✕
'Mosagallaku Mosagadu' Re-Release : కృష్ణ బర్త్ డే సందర్భంగా.. రిలీజ్ కు రెడీ అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమా..
By EhatvPublished on 2 May 2023 12:08 AM GMT
ప్రస్తుతం టాలీవుడ్లో ఇటీవల రీ-రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతుంది. రీ రిలీజ్ ల సినిమాలు సూపర్ హిట్ అవుతూ.. వాటి హవా కూడా కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాను రీ-రిలీజ్ చేస్తూ అభిమానులకు పండగ చేస్తున్నారు మూవీ మేకర్స్. స్టార్ హీరోల బర్త్ డేలు, సినిమాలు లాండ్ మార్క్ ఇయర్స్ ను పురస్కరించుకుని ఎవర్ గ్రీన్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

x
‘Mosagallaku Mosagadu’ Re-Release
-
- ప్రస్తుతం టాలీవుడ్లో ఇటీవల రీ-రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతుంది. రీ రిలీజ్ ల సినిమాలు సూపర్ హిట్ అవుతూ.. వాటి హవా కూడా కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాను రీ-రిలీజ్ చేస్తూ అభిమానులకు పండగ చేస్తున్నారు మూవీ మేకర్స్. స్టార్ హీరోల బర్త్ డేలు, సినిమాలు లాండ్ మార్క్ ఇయర్స్ ను పురస్కరించుకుని ఎవర్ గ్రీన్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
-
- ఈ రీరిలీజ్ ల ట్రెండ్ లో ఇప్పటికే పోకిరి,జల్సా,ఆరెంజ్, బృందావనం,లాంటి సినిమాలు రిలీజ్ చేయగా..ఆడియన్స్ ఈసినిమాలకు పట్టం కట్టారు. అయితే ఈక్రమంలోనే ఇప్పుడు మరో సినిమా రీ-రిలీజ్ కు రెడీ అవుతోంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసేందుకు మూవీ మేకర్స్ సినిమాను రెడీ చేస్తున్నారు.
-
- ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఫస్ట్ కౌబాయ్ మూవీగా వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా. టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యి.. ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో లెజెండరీ హీరో కృష్ణ అద్భుతంగా నటించగా మూవీని లెజండరీ డైరెక్టర్ KSR దాస్ డైరెక్ట్ చేశారు. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈసినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. మోసగాళ్లకు మోసగాళ్లు సినిమాను మే 31న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
-
- ఇండియన్ సినిమాకు 70 ఎంఎం, సినిమాస్కోప్, ఈస్ట్‌మెన్ కలర్, DTS, TFI వంటి కొత్త టెక్నాలజీలను పరిచయం చేసిన హీరో కృష్ణ. అంతే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి కౌబాయ్ మూవీని కూడా ఆయనే చేశారు. ఇక ఇలా ఆయన ఖాతాలో చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇక ఈసినిమాను 4K వర్షన్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి రిలీజ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. మరి ఈసినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Ehatv
Next Story