సోషల్ మీడియా విస్తృతమయ్యాక సినిమావాళ్లు చాలా అలెర్ట్‌గా ఉంటున్నారు. ఇంతకు ముందంటే కాపీలు కొట్టినా, పోస్టర్లను యథాతథంగా దించేసినా ఎవరూ పట్టించుకునేవారు కాదు!
సోషల్ మీడియా విస్తృతమయ్యాక సినిమావాళ్లు చాలా అలెర్ట్‌గా ఉంటున్నారు. ఇంతకు ముందంటే కాపీలు కొట్టినా, పోస్టర్లను యథాతథంగా దించేసినా ఎవరూ పట్టించుకునేవారు కాదు! ఇప్పుడు నెటిజన్లు బాగా తెలివిమీరారు. ఏ సినిమా ఎక్కడ్నుంచి లిఫ్ట్ చేశారు? ఏ పోస్టర్‌ను ఎక్కడ్నుంచి దించేశారన్నది చటుక్కున చెప్పేస్తున్నారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ(Kalki 2998 AD) ట్రైలర్ విషయమే తీసుకుంటే అందులో కొంచెం కాపీనేనట! మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్(Nagashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్(Prabhas) హీరోగా నటించాడు. కమల్ హాసన్(Kamal Haasan), దీపికా పదుకొణె(Deepika Padukone), అమితాబ్ బచ్చన్(Amitab bachchan), దిశా పటానీ(Disha Patani) ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. సరే, మళ్లీ ట్రైలర్ సంగతికొద్దాం. కల్కి సినిమాలో తన ఆర్ట్‌ను కాపీ కొట్టారంటూ దక్షిణ కొరియాకు చెందిన సంగ్ చై(sungchoi) సోషల్ మీడియాలో మూవీ మేకర్స్‌పై విరుచుకుపడుతున్నాడు. సంగ్ చై కాన్సెప్ట్ డిజైనర్‌గా హాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలకు పని చేశాడు. లేటెస్ట్‌గా కల్కి యూనిట్ తన ఆర్ట్‌ను కాపీ కొట్టిందని చెబుతూ అందుకు తగ్గ సాక్ష్యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పదేళ్ల కిందట యూ ట్యూబ్‌లో తాను అప్‌లోడ్ చేసిన విజువల్ ఫోటోను, కల్కి ట్రైలర్ ప్రారంభంలోని ఓ విజువల్ స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేశాడు సంగ్‌చై. దాంతో పాటుగా ఒకరు కష్టపడి తయారు చేసిన ఆర్ట్‌ను దొంగిలించడం అనైతికం అనే క్యాప్షన్ కూడా జోడించాడు. కాసేపయయాక ఆ క్యాప్షన్ తొలగించి కల్కి సినిమా, వైజయంతి మూవీస్ అన్న హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు. ఆ రెండు ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలా కాపీ కొట్టాసారేమిటని కామెంట్లు పెడుతున్నారు. ట్రైలర్‌లోని ఫస్ట్ విజువలే కాపీ కొట్టింది వేశారంటే వాళ్లను ఏమని అనాలో అర్థం కావడం లేదని ఒకరు, ఇది నిజంగా బాధాకరం, కనీసం ఒరిజినల్ ఆర్టిస్టులకు క్రెడిట్ ఇచ్చినా బాగుండేదని మరొకరు .. ఇలా రకరకాల కామెంట్లు వస్తున్నాయి.