ది కేరళ స్టోరీ(the Kerala story) సినిమాపై ఉలగనాయకన్ కమలహాసన్(Kamal Hassan) చేసిన వ్యాఖ్యలపై చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్(Sudipto Sen) స్పందించారు. ఇదో ప్రచారం చిత్రమంటూ కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను సుదీప్తో సేన్ తప్పుపట్టారు. సినిమా చూసిన తర్వాత అభిప్రాయాలు మార్చుకుంటారని అన్నారు. ది కేరళ స్టోరీని ఓ ప్రచార చిత్రమంటూ ఎవరైనా కామెంట్ చేసే మొదట్లో తాను స్పందించేవాడనని, ఇప్పుడు మాత్రం బదులవ్వాలని అనుకోవడం లేదని సుదీప్తో అన్నారు.

Kamal Hassan
ది కేరళ స్టోరీ(the Kerala story) సినిమాపై ఉలగనాయకన్ కమలహాసన్(Kamal Hassan) చేసిన వ్యాఖ్యలపై చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్(Sudipto Sen) స్పందించారు. ఇదో ప్రచారం చిత్రమంటూ కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను సుదీప్తో సేన్ తప్పుపట్టారు. సినిమా చూసిన తర్వాత అభిప్రాయాలు మార్చుకుంటారని అన్నారు. ది కేరళ స్టోరీని ఓ ప్రచార చిత్రమంటూ ఎవరైనా కామెంట్ చేసే మొదట్లో తాను స్పందించేవాడనని, ఇప్పుడు మాత్రం బదులవ్వాలని అనుకోవడం లేదని సుదీప్తో అన్నారు. తమ చిత్రాన్ని ఎవరైతే ప్రచారం చిత్రం అని వ్యాఖ్యలు చేశారో వారు సినిమా చూసిన తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారని చెప్పారు. చూసిన వారంతా సినిమా బాగుందని అంటున్నారని సుదీప్తో తెలిపారు. సినిమాని చూడని వాళ్లే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో తమ సినిమాపై బ్యాన్ విధించారని, అందుకే ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు తమ చిత్రాన్ని వీక్షించలేదు.
అందువల్లే వాళ్లు దీన్ని ఒక ప్రచార చిత్రంగా భావిస్తున్నారని సుదీప్తో సేన్ అన్నారు. అలాగే, మన దేశంలో మూసధోరణులు ఫాలో అయ్యేవాళ్లు ఎక్కువగా ఉన్నాయని . జీవితమంటే కేవలం తెలుపు లేదా నలుపులోనే ఉండాలని అనుకుంటారని, బూడిద రంగులో ఉంటుందని వారికి తెలియదని సెటైర్లు విసిరారు. అదాశర్మ ముఖ్య పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ వివాదాస్పద చిత్రంగా నిలిచింది. సినిమాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ రకమైన నెగటివ్ పబ్లిసిటీనే సినిమాను హిట్ చేశాయి. ఇప్పటికే సినిమా 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఐఫా 2023(IIFA 2023) వేడుకల్లో పాల్గొన్న కమలహాసన్ ఈ సినిమాపై స్పందించారు. తాను ఎప్పుడూ ఒకే మాట చెబుతానని, తనకు ప్రచార చిత్రాలు నచ్చవని, అలాంటి వాటికి తాను పూర్తి వ్యతిరేకినని కమల్ అన్నారు. సినిమా టైటిల్ కింద ‘నిజమైన కథ’ అని రాయగానే సరిపోదు. అలా రాసినంత మాత్రన అది నిజంగా జరిగిన కథ అవ్వదు’’ అని కమలహాసన్ అన్నారు.
