జబర్థస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) లక్కీ ఛాన్స్ కొట్టేశాడు... బుల్లితెర వదిలి వెండితెరపై వెలగాలని ప్రయత్నం చేస్తున్న.. సుధీర్ కు ఏకంగా ప్రభాస్(Prabhas) డైరెక్టర్ తో హీరోగా సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడట.ఇంతకీ ఎవరా దర్శకుడు.. తాను మల్టీ టాలెంటెడ్(Multi Talented) అని నిరూపించుకున్నాడు.. బుల్లి తెర స్టార్ సుధీర్. హీరోగా తనను తానునిరూపించుకున్న సుధీర్.. రీసెంట్ గా గాలోడు మూవీతో ఓ మోస్తరు సక్సెస్ అందుకున్నాడు.కాని సాలిడ్ హిట్ కొట్టి..

జబర్థస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) లక్కీ ఛాన్స్ కొట్టేశాడు... బుల్లితెర వదిలి వెండితెరపై వెలగాలని ప్రయత్నం చేస్తున్న.. సుధీర్ కు ఏకంగా ప్రభాస్(Prabhas) డైరెక్టర్ తో హీరోగా సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడట.ఇంతకీ ఎవరా దర్శకుడు..

తాను మల్టీ టాలెంటెడ్(Multi Talented) అని నిరూపించుకున్నాడు.. బుల్లి తెర స్టార్ సుధీర్. హీరోగా తనను తానునిరూపించుకున్న సుధీర్.. రీసెంట్ గా గాలోడు మూవీతో ఓ మోస్తరు సక్సెస్ అందుకున్నాడు.కాని సాలిడ్ హిట్ కొట్టి.. వెండితెరపై సూపర్ హిరోగా ఎదగాలన్న ఆశతో.. టీవీ షోలు కూడా మానేసి.. హీరోగా నిలబడాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్. కొన్నాళ్ళుగా టీవీషోలు కూడా చేయకపోవడంతో.. . ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇక సుధీర్ ప్రయత్నం ఫలించి.. నక్కతొక తొక్కినట్టున్నాడు.. త్వరగానే అదిరిపోయే క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. గాలోడు లాంటి మాస్ ఎంటర్ టైనర్ తో .. ముందుకు వచ్చిన సుధీర్.. ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు టాక్.

నెక్స్ట్ ఏ సినిమాతో వస్తాడా అని ఎదరుచూస్తన్న ఫ్యాన్స్ కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు జబర్థస్త్ స్టార్. ప్రస్తుతం కాలింగ్ సహస్ర అనే మూవీ చేస్తున్నట్టు ప్రకటించిన సుధీర్.. ఆ సినిమా నుంచి ఒక్క అప్ డేట్ కూడా రాబట్టుకోలేకపోయాడు. అసలు సినిమా షూటింగ్ జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఇక ఈలోపు సుధీర ను అదృష్టం వరించింది. ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా(Mr. Perfect Cinema)చేసిన సీనియర్ దర్శకుడు దశరథ్(Director Dasaradh)సుడిగాలి సుధీర్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. సుధీర్ కు ప్రభాస్ డైరెక్టర్ దశరధ్ తో సినిమా ఫిక్స్ అయ్యిందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంతోషం లాంటి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన దర్శకుడు దశరథ్. ప్రభాస్ తో మిస్టర్ ఫెర్ఫెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. కాని ఆతరువాత ఆయన ఖాతాలో హిట్ లేదు. ప్రయత్నం చేసినా లాభం లేదు. ఇక చివరిగా మంచు మనోజ్ తో శౌర్య మూవీ చేసి.. ఇక అసలు కనిపించకుండా పోయాడు దశరథ్. ఇక తాజాగా సుధీర్ తో సినిమా చేసి మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సుధీర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే.. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ విని దిల్ ఖుష్ అవుతున్నారు.

మెజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. జబర్థస్త్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు సుడిగాలి సుధీర్. జబర్థస్త్ లో అంత మంది కమెడియన్స్ ఉన్నా.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించాడు సుధీర్. ఇక జబర్థస్త్ లో యాంకర్ రష్మీతో ప్రేమాయణం సుధీర్ ను ఇంకా హీరోను చేసింది. బుల్లితెర హీరోగా ఎంతో మంది అభిమానులను సాధించిన సుధీర్...ఆ వేవ్ ను అలానే కొనసాగిస్తూ.. వస్తున్నాడు.

Updated On 20 April 2023 10:11 PM GMT
Ehatv

Ehatv

Next Story