సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer) పాపులర్‌ నటుడే.. జబర్దస్త్‌ షోతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సుధీర్‌ తర్వాత యాంకర్‌గా రాణించాడు. తర్వాత సినీ నటుడయ్యాడు. యాంకర్‌గా ఉన్న సమయంలో సహ యాంకర్‌ రష్మి(Rashmi Gautam0తో ప్రేమాయణం నడిపాడు. ఇది కూడా సుధీర్‌ పాపులరవ్వడానికి కారణమయ్యింది. వీరిద్దరి జోడికి టాలీవుడ్‌లో స్పెషల్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది.

సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer) పాపులర్‌ నటుడే.. జబర్దస్త్‌ షోతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సుధీర్‌ తర్వాత యాంకర్‌గా రాణించాడు. తర్వాత సినీ నటుడయ్యాడు. యాంకర్‌గా ఉన్న సమయంలో సహ యాంకర్‌ రష్మి(Rashmi Gautam)తో ప్రేమాయణం నడిపాడు. ఇది కూడా సుధీర్‌ పాపులరవ్వడానికి కారణమయ్యింది. వీరిద్దరి జోడికి టాలీవుడ్‌లో స్పెషల్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. చాలా మంది వీరిద్దరు ప్రేమలో మునిగిపోయారనుకున్నారు. స్క్రీన్‌ మీద వీరి కెమెస్ట్రీ అలా ఉండింది. అయితే తాము మంచి స్నేహితులమే తప్ప తమ మధ్య ప్రేమ లేదని వీరిద్దరు చాలా సార్లు ప్రకటించారు. అప్పటికీ వదంతులు ఆగలేదు. ఆ మాటకొస్తే వీరిద్దరిపై వచ్చినన్ని పెళ్లి వదంతులు మరే నటులపై రాలేదు.

పాపం వారు మాత్రం ఎన్నిసార్లని క్లారిటీ ఇచ్చుకుంటారు.? అందుకే వివరణనలను ఇచ్చుకోవడం మానేశారు. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే సుధీర్‌ పెళ్లి చేసుకుంటాడని గతంలో ప్రచారం జరిగింది. ఇది ప్రచారం కాదని, నిజమేనని ఇప్పుడు సోషల్‌ మీడియా(Social Media)లో ఓ వార్తతో స్పష్టమవుతోంది. తాజాగా ఆమెతోనే సుధీర్‌ నిశ్చితార్థం చేసుకున్నాడనే వార్త వైరల్‌ అవుతోంది. ఈ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమం కూడా వారి దగ్గర బంధువుల మధ్య జరిగిందని తెలుస్తోంది. దీంతో రష్మీ-సుధీర్‌ అభిమానులు బాధపడిపోతూ సోషల్‌ మీడియాలో పలు కామెంట్లు పెడుతున్నారు. గత రెండు రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ సుధీర్‌ స్పందించకపోవడమే ఫ్యాన్స్‌ను కలవరానికి గురి చేస్తోంది. ఎంటన్నా..? రష్మీతో రీల్‌ పెళ్లి ఎన్నోసార్లు చేసుకున్నారు. కాబట్టి అదే రియల్‌ చేస్తారు అనుకున్నాం అంటూ గతంలో రష్మి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. సుధీర్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో ఆమె చేసిన కామెంట్‌ను మళ్లీ పోస్ట్‌ చేస్తున్నారు. సుధీర్‌తో ప్రేమా, పెళ్లిపై అప్పట్లో రష్మి ఏం చెప్పారంటే 'మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటా. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో, అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు.. ఓ మ్యాజిక్‌లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది' అని రష్మి అప్పుడు చెప్పారు. అంటే ప్రేమలో ఉన్నట్టే కదా! మరి సుధీర్‌ ఇలా చేశాడమేమిటి అని ఫ్యాన్స్‌ కాసింత బాధపడుతున్నారు.

Updated On 1 July 2023 12:29 AM GMT
Ehatv

Ehatv

Next Story