సుడిగాలి సుధీర్(sudigali sudheer) పేరు చెబితే చాలు అప్రయత్నంగా యాంకర్ రష్మీ(Anchor Rashmi) కూడా గుర్తుకొచ్చేస్తారు. జబర్దస్త్(Jabardast) కార్యక్రమంలో వీరిద్దరు కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జబర్దస్త్ షోలో కామెడీ కంటే సుధీర్-రష్మీ జంటే హైలైట్ అయ్యింది. కొన్నేళ్ల పాటు కలసి షో చేసిన వీరు తర్వాత మానేశారు. జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ బయటకు వెళ్లిపోవడంతో మళ్లీ ఈ జంటను చూసే అవకాశం లభించలేదు ప్రేక్షకులకు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్- రష్మి కలిసి ఇంతకు ముందులాగే ప్రేమలో మునిగితేలారు. ఆ ఈవెంట్ లో కలిసి యాంకరింగ్ చేసిన సుధీర్-రష్మీ.. 'నిజమేనా చెబుతున్నా జానే జానా' పాటకు డ్యాన్స్ చేశారు.
సుడిగాలి సుధీర్(sudigali sudheer) పేరు చెబితే చాలు అప్రయత్నంగా యాంకర్ రష్మీ(Anchor Rashmi) కూడా గుర్తుకొచ్చేస్తారు. జబర్దస్త్(Jabardast) కార్యక్రమంలో వీరిద్దరు కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జబర్దస్త్ షోలో కామెడీ కంటే సుధీర్-రష్మీ జంటే హైలైట్ అయ్యింది. కొన్నేళ్ల పాటు కలసి షో చేసిన వీరు తర్వాత మానేశారు. జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ బయటకు వెళ్లిపోవడంతో మళ్లీ ఈ జంటను చూసే అవకాశం లభించలేదు ప్రేక్షకులకు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్- రష్మి కలిసి ఇంతకు ముందులాగే ప్రేమలో మునిగితేలారు. ఆ ఈవెంట్ లో కలిసి యాంకరింగ్ చేసిన సుధీర్-రష్మీ.. 'నిజమేనా చెబుతున్నా జానే జానా' పాటకు డ్యాన్స్ చేశారు. తమ కెమిస్ట్రీ ఇంకా అలాగే ఉందని చాటి చెప్పారు. ఈ ప్రదర్శన తర్వాత రష్మీతో తన అనుబంధంపై సుధీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతకంటే ముందు స్క్రీన్ పై సుధీర్‌తో తను ఉన్న పాత వీడియోలని ప్లే చేయగా, రష్మీ భావోద్వేగాలకు లోనయ్యారు. రష్మీతో నాది బ్యూటీఫుల్ జర్నీ అని సుధీర్ చెప్పగానే.. బ్యూటీఫుల్ జర్నీనా? లవ్ జర్నీనా? అని గెటప్ శీను పంచ్ వేశాడు. దీనికి సుధీర్ చక్కటి జవాబిచ్చాడు. బేసికల్‌గా రష్మి సెన్సిటివ్ అని , చాలా కష్టపడేతత్వం ఉన్న వ్యక్తి అని, తనకు అందరికంటే రష్మీ చాలా ఎక్కువ అని ఆమెని తెగ పొగిడేశాడు. 'మేము ఎక్కడికి వెళ్లినా మా ఇద్దరి గురించే అడుగుతూ ఉంటారు. చెప్పాలంటే నా జర్నీలో, సక్సెస్ లో రష్మీదే మెయిన్ రోల్. కెరీర్ లో నేను ముందుకెళ్లడానికి, స్కిట్స్ తోపాటు రష్మీ పాత్ర చాలా ఉంది. ఆమెతో చేసిన ప్రోగ్రామ్స్, స్కిట్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి' అని సుధీర్ చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో రష్మీకి థ్యాంక్స్ చెప్పిన సుధీర్.. దానితో పాటు మిస్ యూ అని చెప్పడం ఆసక్తకరంగా మారింది.