సినిమా థియేటర్ల దగ్గర రాబోయే రోజుల్లో సందడి వాతావరణం నెలకొననుంది

సినిమా థియేటర్ల దగ్గర రాబోయే రోజుల్లో సందడి వాతావరణం నెలకొననుంది. ముఖ్యంగా వచ్చే శుక్రవారం నుండి మంచి బజ్ ఉన్న సినిమాలు విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది. మే 31న ఏ.. యే.. సినిమాలు విడుదలవుతాయనే విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఆరోజు ఏకంగా ఐదు తెలుగు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడే అవకాశం ఉందని అనిపించగా.. ఇప్పుడు ఈ సినిమాలలో కొన్ని తప్పనిసరిగా వాయిదా పడాల్సి ఉంది.

సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోమ్ హర' ఇప్పుడు మే 31న కాకుండా జూన్ 14న విడుదల కానుంది. వివిధ కారణాల వల్ల ఇప్పుడు జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా రిలీజ్ మిస్ అయినందుకు బాధగా ఉందని సుధీర్ బాబు రెలిపారు. జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఈ పీరియాడికల్ సినిమాని సుమంత్ జి నాయుడు నిర్మించారు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు

Updated On 21 May 2024 1:04 AM GMT
Yagnik

Yagnik

Next Story