ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు కానీ తొమ్మిదో దశకంలో సుచిత్రా కృష్ణమూర్తి(Suchitra Krishnamurthy) చాలా ఫేమస్. ఆమె యాక్టింగ్‌కే కాదు.. ఆమె పాటలకు కూడా జనం ఫిదా అయ్యారు. ముఖ్యంగా డోల్ డోల్ .. దమ్ తారా అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలాగే షారూక్ ఖాన్ సూపర్‌హిట్ పాట కబీ హాన్ కబీ నా(Kabhi Haan Kabhi Na) పాట కూడా పాపులరే! మార్చి 9, 1974లో ముంబాయిలో జన్మించారు సుచిత్ర.
ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు కానీ తొమ్మిదో దశకంలో సుచిత్రా కృష్ణమూర్తి(suchitra krishnamoorthi) చాలా ఫేమస్. ఆమె యాక్టింగ్‌కే కాదు.. ఆమె పాటలకు కూడా జనం ఫిదా అయ్యారు. ముఖ్యంగా డోల్ డోల్ .. దమ్ తారా అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలాగే షారూక్ ఖాన్ సూపర్‌హిట్ పాట కబీ హాన్ కబీ నా(Kabhi Haan Kabhi Na) పాట కూడా పాపులరే! మార్చి 9, 1974లో ముంబాయిలో జన్మించారు సుచిత్ర. ఆమె తల్లిదండ్రులు తెలుగువారే! తండ్రి వి.కృష్ణమూర్తి(V. KrishnaMurthy) ఇన్‌కమ్‌టాక్స్ కమిషనర్‌గా(Income tax Commissioner) పని చేశారు.
తల్లి డాక్టర్ సులోచన ప్రొఫెసర్(Prof Dr.sulochana). ఇప్పుడు సుచిత్ర కృష్ణమూర్తి టాపిక్ ఎందుకొచ్చిందంటే ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి. తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్‌లో(shekar kapoor) నిజాయితీ లేదని, ప్రేమించి పెళ్లి చేసుకుని తనను మోసం(Cheat) చేశాడని సుచిత్ర ఆరోపించారు. అందుకే శేఖర్‌తో తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. తనకు సినీ ఇండస్ట్రీలో తెలిసినవారు లేకపోయినా సినిమాల మీద ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చానని సుచిత్ర అన్నారు. సినిమాలంటే తన పేరంట్స్‌కు మంచి అభిప్రాయం లేదని, అందుకే వారికి అబద్దం చెప్పి కొచ్చి వెళ్లి సినిమాలో పని చేశానని చెప్పారు.
కిలుక్కంపెట్టి(Kilukkampetti)అనే మలయాళ చిత్రంతో ఆమె నటి అయ్యారు. కభి హా కభి నా చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ సినిమా సూపర్‌హిట్టవ్వడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో శేఖర్ కపూర్‌తో(Shekar Kapoor) ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని, అప్పటికే తనకు సినిమాల్లో మంచి క్రేజ్ ఉందని సుచిత్ర అన్నారు. కానీ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని శేఖర్ కపూర్ కండీషన్ పెట్టినట్టు చెప్పారు.
శేఖర్ మాటకు గౌరవం ఇచ్చి వచ్చిన సినిమా అవకాశాలను కూడా వదలుకున్నానన్నారు సుచిత్ర. శేఖర్ కపూర్‌ని పెళ్లి చేసుకోవడం తన తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకు ప్రధాన కారణం తనకంటే వయసులో 30 ఏళ్లు పెద్దవాడని సుచిత్ర అన్నారు. పైగా అప్పటికే ఆయనకు విడాకులు కూడా అయ్యాయన్నారు. ఇంట్లో ఒప్పుకోకపోయినా తాను శేఖర్‌ను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. అతడిని పెళ్లి చేసుకోవద్దని అమ్మ ఎన్ని సార్లు చెప్పినా వినకుండా చేసుకున్నానని సుచిత్ర అన్నారు. ఇష్టంతో పెళ్లి చేసుకుంటే తను మోసం చేసి వెళ్లిపోయాడని సుచిత్ర కృష్ణమూర్తి తెలిపారు.