ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి(kethu viswanatha) సోమవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) ఒంగోలులో(Ongole) కన్నుమూశారు. ఆయన వయసు 84. విశ్వనాథరెడ్డి రాయలసీమ ప్రాంత సంస్కృతి, నైతికతలను అదే మాండలికంలో తన కథలు, నవలల్లో వివరంగా ఆవిష్కరించారు.

kethu viswanatha reddy
ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి(kethu viswanatha) సోమవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) ఒంగోలులో(Ongole) కన్నుమూశారు. ఆయన వయసు 84. విశ్వనాథరెడ్డి రాయలసీమ ప్రాంత సంస్కృతి, నైతికతలను అదే మాండలికంలో తన కథలు, నవలల్లో వివరంగా ఆవిష్కరించారు. విశ్వనాథ్ రెడ్డి రెండు రోజుల క్రితం ఒంగోలులోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు.. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున విశ్వనాథ్‌రెడ్డి మృతి చెందారు. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు సాహిత్య రంగంలో పలు అవార్డులను అందుకున్నారు.
కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సామాజిక సంస్కరణల అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని సీఎం అన్నారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
