ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7 కు ముహూర్తు కుదిరింది. ఈరోజో రేపో.. ఆముహూర్తం టైమ్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు బిగ్ బాస్ టీమ్. హోస్ట్ పై కూడా ఇప్పటి వరకూ ఉన్న ఉత్కంట తీరిపోయింది. హోస్ట్ గా ఆసారి రానా(Rana) వస్తాడు.. బాలయ్య(Balayya) వస్తాడు.. లేదు విజయ్ దేవరకొండ ఫిక్స్(Vijay Devarkonda) అన్నారు.. కాని మరోసారి కింగ్ నాగార్జునను(Nagarjuna) ప్రకటిస్తూ..

బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 7 కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక వెరీ సూన్ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్.. వారం గ్యాప్ కూడా లేకుండానే.. బిగ్ బాస్ తెలుగుసీజన్ 7 నుంచి రెండు ప్రోమోలు(Promo) రిలీజ్ చేశారు టీమ్. అంతే కాదు హోస్ట్ విషయంలో.. కూడా ఉత్కంటకు తెరపడింది.

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7 కు ముహూర్తు కుదిరింది. ఈరోజో రేపో.. ఆముహూర్తం టైమ్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు బిగ్ బాస్ టీమ్. హోస్ట్ పై కూడా ఇప్పటి వరకూ ఉన్న ఉత్కంట తీరిపోయింది. హోస్ట్ గా ఆసారి రానా(Rana) వస్తాడు.. బాలయ్య(Balayya) వస్తాడు.. లేదు విజయ్ దేవరకొండ ఫిక్స్(Vijay Devarkonda) అన్నారు.. కాని మరోసారి కింగ్ నాగార్జునను(Nagarjuna) ప్రకటిస్తూ.. స్టార్ మా తాజా ప్రోమోను రిలీజ్ చేసింది. అయితే సీజన్ 7 సూన్ అన్నారు కాని.. బిగ్ బాస్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈసారి మరిన్ని సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో పాటు.. ఎమోషన్స్ అంతకు మించిన అంశాలు ఉంటాయని ముందుగానే వెల్లడించిన బిగ్ బాస్ టీమ్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోని పంచుకున్నారు.

స్టార్ మా మరియు డిస్నీ+ హాట్‌ స్టార్‌(Disney+Hotstar) ఓటీటీలోనూ బిగ్ బాస్ స్ట్రీమింగ్‌ కానుందని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా హోస్ట్ ని అనౌన్స్ చేసిన మేకర్స్.. సరికొత్త ప్రోమోని రిలీజ్ చేసారు. గత నాలుగుసీజన్లకు నాగార్జున యాంకర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం 5వసారి హోస్టింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. బిగ్ బాస్ గురించి మీకు తెలిసిందని మీరు అనుకున్నదంతా విప్లవాత్మకంగా మారబోతోంది మీకు అత్యంత ఇష్టమైన నాగార్జునతో ఈ సీజన్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? గందరగోళంగా ఉందా? ఉత్సాహంగా ఉందా..? బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి అని స్టార్ మా తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పోస్ట్ చేశారు.

ప్రోమోలో.. ఈసారి సీజన్ 7 సరికొత్తగా ఉండబోతోంది అని చెప్పబోయిన నాగార్జున.. రొటీన్ గా చెప్పేదేగా అంటూ ఆగిపోతారు.. ఆతరువాత చుట్టు ఉన్న వస్తువలు పైకి లేవడం.. తో ఈసారి సీజన్ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసారి కింగ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. కంప్లీట్ గా లుక్ మార్చేశాడు నాగ్. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ.. డిఫరెంట్ స్టైల్లో కనిపించడానికి ప్రయత్నంచేశాడు.

Updated On 20 July 2023 7:14 AM GMT
Ehatv

Ehatv

Next Story