కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)తన రాబోయే చిత్రం 'జవాన్' (Jawaan Movie)షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. షారుక్ తన ప్రతి సినిమా షూటింగ్ కోసం చాలా కష్టపడతాడు. ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్‌లో షూటింగ్‌లో ఉన్న షారుక్ గాయపడ్డాడు. షారుఖ్‌కు ముక్కుపై గాయం కావడంతో వెంటనే చిత్ర బృందం ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. రక్తస్రావం ఆపడానికి షారుక్ చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చిందని కూడా నివేదికలు చెబుతున్నాయి.

Shah Rukh Khan Injured
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)తన రాబోయే చిత్రం 'జవాన్' (Jawaan Movie)షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. షారుక్ తన ప్రతి సినిమా షూటింగ్ కోసం చాలా కష్టపడతాడు. ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్‌లో షూటింగ్‌లో ఉన్న షారుక్ గాయపడ్డాడు. షారుఖ్‌కు ముక్కుపై గాయం కావడంతో వెంటనే చిత్ర బృందం ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. రక్తస్రావం ఆపడానికి షారుక్ చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చిందని కూడా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం షారుక్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
సర్జరీ అనంతరం కింగ్ ఖాన్ ముక్కుకు బ్యాండేజీతో విమానాశ్రయంలో కనిపించారు. షారుక్ ఖాన్ ఇప్పుడు ముంబైకి తిరిగి వచ్చి తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే.. ఇప్పటి వరకు షారుక్ బృందం అతని ప్రమాదానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. షారుక్ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. షారుక్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
