వివాదంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి చిక్కుకున్నారు.

వివాదంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి చిక్కుకున్నారు. డైరెక్టర్ రాజమౌళి తనను వేధిస్తున్నానంటూ అతని వేధింపులు తట్టుకోలేక తాను చనిపోతున్నట్లు ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో తీసి, లెటర్ రాశాడు. తాను రాజమౌళి 1990 నుంచి స్నేహితులమని ఒకే కంచం, ఒకే మంచం అన్న రీతిలో తాము ఉండేవారమన్నారు. రామాయణం, మహాభారతం ఒక స్త్రీ వల్లే జరిగిందంటే ఏంటో అనుకున్నాను కానీ తమ జీవితంలో కూడా ఓ మహిళ ప్రవేశించిందన్నారు. ఆమెనె రమా రాజమౌళి అని తమది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని.. అప్పడు తాను రమను సాక్రిఫై చేశానని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఇదంతా శాంతినివాసం సీరియల్ కంటే ముందే జరిగిందన్నారు. కెరీర్ బిగినింగ్ కాబట్టి తానే సాక్రిఫై చేసినట్లు శ్రీనివాస్‌రావు వీడియలో చెప్పారు. కానీ రాజమౌళి నెం.1 డైరెక్టర్ అయిన తర్వాత తనను వేధించడం ప్రారంభించాడన్నారు. ఎక్కడ తమ లవ్ స్టోరీ ఇండస్ట్రీలో అందరికీ చెప్తానో అనే విషయాన్ని మనసులో పెట్టుకొని తనను మెంటల్‌గా టార్చర్ పెట్టాడన్నారు. అందరినీ తనకు దూరం చేశాడని.. రాజమౌళి టార్చర్ భరించలేక తాను చనిపోవాలనుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీశారు. ఇందుకు సాక్ష్యాలు కావాలంటే రాజమౌళికి లైడిక్టర్ పరీక్ష పెడితే నిజానిజాలు బయటపడతాయన్నారు. ఇండస్ట్రీలో ఈ విషయం దుమారం రేపుతోంది. ఈ వివాదంపై రాజమౌళి స్పందన ఎలా ఉంటుందో మరి..!
