ఒక్క తెలుగు సినిమా మాత్రమే కాదు. ఇండియన్ సినిమాను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా చూపించాడు.. టాలీవుద్ దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli). ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో ఆస్కార్(Oscar) సాధిండమే కాదు.. ప్రపంచ దేశాల అధినేతలను కూడా ఆకర్శిస్తున్నాడు.
ఒక్క తెలుగు సినిమా మాత్రమే కాదు. ఇండియన్ సినిమాను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా చూపించాడు.. టాలీవుద్ దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli). ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో ఆస్కార్(Oscar) సాధిండమే కాదు.. ప్రపంచ దేశాల అధినేతలను కూడా ఆకర్శిస్తున్నాడు.
తెలుగుసినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాతో రాజమౌళి, తారక్(Jr.NTR), రామ్‌చరణ్‌లు(Ram Charan) గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ఆస్కార్(Oscar), గోల్డెన్‌గ్లోబ్(Golden Globe) అవార్డులతోపాటు జాతీయ అవార్డుల్లో కూడా ఆర్ఆర్ఆర్ తన సత్తా చాటింది . వసూళ్ళ పరంగా కూడా రికార్డ్ క్రియేట్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్... రిలీజ్ అయిన ఏడాదిన్నర పైనే అవుతున్నా.. ఏమాత్రం ఇమేజ్ తక్కుండా.. ఇప్పటికీ హాట్ టాపిక్ గా నిలుస్తోంది.
ఎప్పటికప్పుడు ప్రపంచ ప్రఖ్యాతులు ఎవరో ఒకరు ఈసినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఇదిలావుంటే.. బ్రెజిల్ అధ్యక్షకుడు లూయిజ్ ఇనాసియో లూలడసిల్వ(Brazil President Luiz Inacio Lula da Silva) ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ-“ఆనాటి బ్రిటీష్ నిరంకుశత్వంపై ఘాటైన విమర్శలే చేసినా, అర్థవంతంగా చూపించారు దర్శకుడు.అద్భుతమైన సన్నివేశాలు, అబ్బురపచిచే డ్యాన్సులు మూడు గంటలు ఎంజాయ్ చేశాను” అంటూ చిత్ర యూనిట్‌ని ప్రశంసించారు.
కాగా, ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ కూడా లూయిజ్ ప్రశంసకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’పై బ్రెజిల్ అధ్యక్షుని ప్రశంస ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది. అటు తారక్ ఫ్యాన్స్.. ఇటు చరణ్ ఫ్యాన్స్ తో పాటు.. రాజమౌళి అభిమానులు కూడా ఈన్యూస్ విని సంతోషిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.