ఎట్టకేలకు షూటింగ్ సెట్లో అడుగు పెట్టింది ధమాకా బ్యూటీ శ్రీలీల. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఉస్తాబ్ భగత్ సింగ్ లో శ్రీలీలా మెయిన్ హీరోయిన్ గా వచ్చిందా..? సెకండ్ హీరోమిన్ గానా..?

ఎట్టకేలకు షూటింగ్ సెట్లో అడుగు పెట్టింది ధమాకా బ్యూటీ శ్రీలీల(Srileela). పవర్ స్టార్ పవన్ కళ్యాన్(power star pawan kalyan) ఉస్తాబ్ భగత్ సింగ్(ustad bagat singh) లో శ్రీలీలా మెయిన్ హీరోయిన్ గా వచ్చిందా..? సెకండ్ హీరోమిన్ గానా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. హరీష్ శంకర్(Harish shankar) డైరెక్షన్ లో తెరకెక్కుతున్నసినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mytri movie makers) బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత పవర్ కళ్యాణ్.. డేట్స్ ఇవ్వడంతో డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమాను సెట్స్ ఎక్కించాడు.. షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పుడో ఈసినిమాను అనౌన్స్ చేసినా..పవర్ స్టార్ కు టైమ్ కుదరక ఈసినిమాను పెండింగ్ లో పెట్టారు.ఇక రీసెంట్ గా ఈసినిమా షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ రావడంతో పాటు... పవన కళ్యాణ్ షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం దాదాపు 30 రోజులు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 25 రోజులు ఈసినిమాకు టైమ్ కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ - అల్యూమినియం(Aluminium) ఫ్యాక్టరీలో షూటింగు జరుపుకుంటోంది. తాజాగా ఈ షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయినట్టుతెలుస్తోంది. ఈలోకేషన్ లో శ్రీలీల కాంబినేషన్లోని సీన్స్ కూడా ఉండటంతో ఆమె ఈ రోజున సెట్స్ పైకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ అందరికి ఒక డౌట్ ఏంటంటే.. ఈసినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తోందా..? లేదా..?

ఇప్పటి వరకూ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎవరినీ అనౌన్స్ చేయలేదు. పూజ హెగ్డేను(Pooja hegde) అనుకున్నారు కాని.. చెప్పలేదు. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను సెట్ చేసుకున్నారు. అయితే పూజా డేట్స్ లేవంటూ.. పూకార్లువస్తున్నాయి. టీమ్ కూడా సైలెంట్ గా ఉండటంతో .. శ్రీలీలనే మెయిన్ హీరోయిన్ అని టాక్ వినిపిస్తుంది. పూజ ప్లేస్ లో శ్రీలీలను తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయయంలో అఫీషియల్ గా మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఒక వేలసెకండ్ హీరోయిన్ గా వేరే హీరోయిన్ ను తీసుకుంటారా..? లేక మెయిన్ హీరోయిన్ గానే ఇంకొక స్టార్ హీరోయిన్ ను తీసుకుంటారా అనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

టాలీవుడ్ లో వరుస ఆఫర్ల తో దూసుకుపోతోందతి శ్రీలీల. యంగ్ హీరోలతో పాటు.. తనకంటే వయస్సులో బాగా పెద్దవాళ్లయిన స్టార్ సీనినియర్ హీరోల సరసన కూడా మెరుస్తోంది. ఈ ఏడాదిలో రానున్న చాలా ప్రాజెక్టులలో ఆమె సందడి చేయనుంది. ఒక వైపున బాలయ్య 108వ సినిమాలో .. మరో రామ్ .. నితిన్ సినిమాతో ఆమె బిజీగా ఉంది. తాజాగా ఈ రోజున ఆమె పవన్ పక్కన నటిస్తోంది. ఆ మధ్య ధమాకాలో రవితేజ జోడీగా అదరగొట్టింది.

Updated On 12 April 2023 12:31 AM GMT
Ehatv

Ehatv

Next Story