మరో తెలుగు హీరోయిన్ ప్రేమలో పడ్డారు. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఎవరా హీరోయిన్ అనే అనుమానం వచ్చేసింది కదూ! ఆమె ఎవరో కాదు నటి శ్రీదివ్య(Sridivya). బాల నటిగా కెరీర్ మొదలు పెట్టిన శ్రీదివ్య పరహారణాల తెలుగు అమ్మాయి.
మరో తెలుగు హీరోయిన్ ప్రేమలో పడ్డారు. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఎవరా హీరోయిన్ అనే అనుమానం వచ్చేసింది కదూ! ఆమె ఎవరో కాదు నటి శ్రీదివ్య(Sridivya). బాల నటిగా కెరీర్ మొదలు పెట్టిన శ్రీదివ్య పరహారణాల తెలుగు అమ్మాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్టాప్(Busstop), కేరింత(Kerintha) అనే సినిమాల్లో నటించిన శ్రీదివ్య తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి వెళ్లారు. అక్కడ శివకార్తికేయన్(shivakarthikeya) హీరోగా వచ్చిన వరుత్తపడాద వాలిబర్ సంఘం అనే సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీదివ్య ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో అక్కడే సెటిల్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కాక్కీ సట్టై, జీవా, ఈటీ, మరుదు, బెంగుళూర్ నాట్కల్, పెన్సిల్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. ప్రస్తుతం విక్రమ్ ప్రభురడ్(Vikram Prabhurad) సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో శ్రీదివ్యని ప్రేమ, పెళ్లి గురించి జర్నలిస్టు అడిగారు. దీనికి బదులిచ్చిన ఈ అమ్మాయి త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ప్రేమ వివాహమే చేసుకుంటానని, అదీ నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. దీంతో ఎవరా ప్రేమికుడు? ఎప్పుడు పెళ్లి చేసుకోనున్నారు? అనే ఆసక్తి పెరిగింది.