ఇన్నేళ్ల తెలుగు సినిమాలో కొన్ని వేల పాటలు వచ్చి ఉంటాయి. చాలా కొన్నింటినే మనం చాలా కాలం గుర్తుపెట్టుకుంటాం! అందులో పదో పదిహేనో అచిర కీర్తిని సంపాదిస్తాయి. అసలు తెలుగు సినిమాలలో అత్యుత్తమ పాట ఏదై ఉంటుంది? జనం నోళ్లలో పదే పదే నానుతున్న పాట ఏదై ఉంటుంది? ఈ అనుమానమే ఓ పరిశోధనా సంస్థకు వచ్చింది.

ఇన్నేళ్ల తెలుగు సినిమాలో కొన్ని వేల పాటలు వచ్చి ఉంటాయి. చాలా కొన్నింటినే మనం చాలా కాలం గుర్తుపెట్టుకుంటాం! అందులో పదో పదిహేనో అచిర కీర్తిని సంపాదిస్తాయి. అసలు తెలుగు సినిమాలలో అత్యుత్తమ పాట ఏదై ఉంటుంది? జనం నోళ్లలో పదే పదే నానుతున్న పాట ఏదై ఉంటుంది? ఈ అనుమానమే ఓ పరిశోధనా సంస్థకు వచ్చింది. ఆ సంస్థ వారు ఎన్నో ప్రయాసాలకోర్చి ఆ పాటను కనిపెట్టారు. ఆ పాటే సీతారామకళ్యాణం సినిమాలోని శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి...తెలుగువారి సంప్రదాయజీవనంపై ఈ పాట సాధించిన విజయం అపూర్వం. తెలుగునాట ఈపాటలేని పెళ్లి పందిరి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ పాట లేకపోతే ఆ వివాహవేడుకలో ఏదో ఒక లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. అందుకే ఎంత కష్టమైనా ఈ పాటను తెప్పించుకుంటారు పెళ్లి పెద్దలు. ఈ పాట లేకపోతే అశుశమేమోనని భావిస్తారు. అదో సెంటిమెంట్ అయ్యింది. చాలా రామాలయాల్లో ఈ పాట పదే పదే వినిపిస్తుంటుంది.

పి.సుశీల బృందంతో కలిసి అద్భుతంగా ఆలపించిన ఈ పాటను సముద్రాల రాఘవాచార్య రాశారు. గాలి పెంచలనరసింహరావు సంగీతాన్ని అందించారు. చాలా మంది గాలిపెంచల నరసింహరావు అని అంటుంటారు. అది కరెక్ట్‌ కాదు. గాలి ఆయన ఇంటిపేరు. పూర్తిగా మధ్యమావతి రాగంపై ఈ పాట సాగుతుంది. ఆణిముత్యములు తలంబ్రాలుగా శిరముల మెరసిన సీతారాముల కళ్యాణము చూతము రారండి తర్వాత వాద్య సంగీతంగా వచ్చే ఆనందమానందమాయెనే అన్నది ఒక్కటే ఆనందభైరవిలో స్వరపరిచారు. ఈ పాటను దర్శకుడు ఎన్‌.టి.రామారావు ఎంతో అద్భుతంగా, కళాత్మకంగా చిత్రీకరించారు. సీతారాముల పాత్రలను ధరించిన గీతాంజలి, హరనాథ్‌పై ప్రధానంగా ఈ పాటను చిత్రీకరించారు. మిగిలిన పాత్రధారులు కూడా ఈ పాటలో కనిపిస్తారు. నిజానికి సీతారామకళ్యాణం సినిమాకు ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించారు. కానీ దర్శకుడిగా తన పేరును ఆయన వేసుకోలేదు. యూనిట్‌ అంటూ ఆ క్రెడిట్‌ను తన బృందానికి పంచారు. ఆ పాట పూర్తి సాహిత్యం EHA పాఠకుల కోసం!

సీతారాముల కళ్యాణం చూతము రారండి..
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి..
చూచువారలకు చూడముచ్చటట
పుణ్యపురుషులకు ధన్యభాగ్యమట
భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట
సురలును మునులును చూడవత్తురట
కళ్యాణము చూతము రారండి

దుర్జన కోటిని దర్పమడంచగ
సజ్జన కోటిని సంరక్షింపగ
ధారుణి శాంతిని స్థాపన చేయగ
నరుడై పుట్టిన పురుషోత్తముని
కళ్యాణము చూతము రారండి
దశరథ రాజు సుతుడై వెలసి
కౌశిక యాగము రక్షణ జేసి
జనకుని సభలో హరువిలు విరచి
జానకి మనసు గెలిచిన రాముని
కళ్యాణము చూతము రారండి

సిరి కళ్యాణము బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్లి కూతురై వెలసిన సీతా
కళ్యాణము చూతము రారండి
సంపగి నూనెను కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి
చెంప జవాది చుక్కను బెట్టి
పెండ్లి కొడుకై వెలసిన రాముని
కళ్యాణము చూతము రారండి
జానకి దోసిట కెంపుల ప్రోగై
రాముని దోసిట నీలపు రాశై
ఆణి ముత్యములు తలంబ్రాలుగా
శిరముల మెరిసిన సీతారాముల
కళ్యాణము చూతము రారండి

Updated On 30 March 2023 7:13 AM GMT
Ehatv

Ehatv

Next Story